తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రాల నడుమ అర్చకులు గరుడ ధ్వజాన్ని ఎగురవేసి, అష్టదిక్పాలకులను పూజార్కంగా ఆహ్వానించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తుల విశ్వాసాలకు ఆలవాలం చేస్తూ, ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి.
గరుడ ధ్వజం ఎగురవేసిన వేళ
శ్రీవారి బ్రహ్మోత్సవాల పర్వదినాల్లో మొదటిరోజు జరిపే ధ్వజారోహణం ప్రత్యేకమైనది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి సన్నిధిలో అర్చక స్వాములు గరుడ ధ్వజాన్ని ఎగురవేసారు. ఈ ధ్వజారోహణం సకల దేవతల రాకకు సంకేతంగా, బ్రహ్మోత్సవాల ప్రారంభానికి శ్రీకారం చుడుతుంది.
ఈ పండుగలో వాహనసేవలు, ప్రత్యేక అలంకరణలు, నిత్యారాధనలు వంటివి శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మికను అనుభూతిని కలగజేస్తుంది.. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపను పొందుతారు.
సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.