విజయవాడ నగరంలో ఎక్కడ పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదని ఆదేశించారు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ నగర పరిధిలో ఎక్కడనూ, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, విజయ టాకీస్ వద్దకు కుమరయ్య వంతెనలో వ్యర్ధాలను చూసిన కమిషనర్ ధ్యానచంద్ర వెంటనే అక్కడి నుంచి వ్యర్ధాలను తొలగించి పరిశుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు.నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర హెచ్.యం. ఆదివారం ఉదయం అజిత్ నగర్, గురునానక్ కాలనీ రోడ్, రమేష్ హాస్పిటల్ రోడ్, అమ్మ కళ్యాణ మండపం ప్రాంతం, సిద్ధార్థ కాలేజ్, విజయ టాకీస్ తదితర ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ప్రజల నుండి వ్యర్ధాల సేకరణ ప్రతిరోజు జరగాలని, నగరంలో యధావిధిగా పారిశుధ్య నిర్వహణ క్రమ తప్పకుండా ప్రతిరోజు జరగాలని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.నగరంలోని సేకరిస్తున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు అజిత్ సింగ్ నగర్ లోని ఎక్సెల్ ప్లాంట్ లో తరలించారని, ఎక్సెల్ ప్లాంట్లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు అక్కడనుండి జిందల్ ప్లాంట్కి తరలిస్తూ వ్యర్ధ నిర్వహణ చేస్తూ ఉండాలని, ఎక్సెల్ ప్లాంట్లలోని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావం లేని మిగిలిన 32 వార్డులలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగిస్తూ, నగరంలో ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తూ, ప్రజలకు పారిశుద్ధ్య సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తుండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా విజయవాడ నగరపాలక సంస్థ వారితో సహకరించి వ్యర్ధాలను విజయవాడ నగరపాలక సంస్థ వారి చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడే వ్యర్థాలను ఇవ్వాలని కోరారు.