కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం లో మంగళవారం రాత్రి దుండగులు ఏటీఎం మెషిన్ ను ఎత్తుకెళ్లారు. ఈ ఏటీఎం మెషిన్ లో ఏకంగా 3.95 లక్షల నగదు వారు దొంగిలించారు. ఈ సంఘటన అర్ధరాత్రి మూడు గంటల సమయంలో జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ చోరీపై సెక్యూరిటీ గార్డు పై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
బాన్సువాడ DSP సత్యనారాయణ, CI సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. SI మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల 20 నిమిషాల సమయంలో జరిగిఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. దొంగలు చాల చాకచక్యంగా ATM లోకి చొరబడి ఏకంగా మెషిన్ నే ఎత్తుకెళ్లారు. బ్రాంచ్ మేనేజర్ మోహన్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాల ఆధారాలు
ప్రధాన కూడలిలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించగా దొంగలు మహారాష్ట్ర వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. స్థానికులు ఈ సంఘటన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
స్థానికుల స్పందన
నగదు ఎత్తుకెళ్లిన ఘటనలు మామూలుగా చూస్తుంటాం కానీ ఏకంగా ఏటీఎం మిషిన్‌ను ఎత్తుకెళ్లడం చాలా అరుదైన ఘటన అని వారు పేర్కొన్నారు. పోలీసులు త్వరలోనే దుండగులను పట్టుకుంటామని తెలిపారు.
ఈ సంఘటన పెద్ద ఎత్తున భద్రతా లోపాన్ని సూచిస్తుంది మరియు ఇలాంటి సంఘటనలను నివారించడానికి బ్యాంకులు తమ ఏటీఎం భద్రతా చర్యలను బలోపేతం చేయాలని అధికారులను కోరుతున్నారు. స్థానికులు పోలీసుల దర్యాప్తు గురించి కొత్త వివరాలు ఎదురుచూస్తున్నారు.