**పేపర్డబ్బా న్యూస్ డెస్క్** – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మరియు సీనియర్ టీడీపీ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు చైర్మన్గా నియమించింది.
విజయనగరం రాజ కుటుంబం వారసుడైన గజపతిరాజు, రాజకీయాలలో అనేక సంవత్సరాలుగా ఉన్నారు. ఎంపీగా, మరియు కేంద్ర పౌర విమానయాన మంత్రిగా 2014 నుండి 2018 వరకు సేవలందించారు. ఆంధ్ర ప్రదేశ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నేతృత్వంలోనే జరిగాయి
ఈ నియామకం పై తెలుగు దేశం పార్టీ (టీడీపీ) శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.అయన పార్టీ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా భావిస్తున్నారు
గజపతిరాజు నేతృత్వంలో, TTD బోర్డు పరిపాలనపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన సమర్థ నాయకత్వం మరియు ప్రజా సేవకు కట్టుబాటుతో, TTD బోర్డు కార్యకలాపాల్లో పారదర్శకత తీసుకొస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.