• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home జాబ్స్

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు మొదలుపెట్టిన టీఎస్‌పీఎస్సీ, OMR విధానంలోనే పరీక్ష!

sastra_admin by sastra_admin
May 27, 2023
in జాబ్స్
0 0
0
tspsc:-గ్రూప్‌-1-ప్రిలిమినరీకి-ఏర్పాట్లు-మొదలుపెట్టిన-టీఎస్‌పీఎస్సీ,-omr-విధానంలోనే-పరీక్ష!

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టయింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. 

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను మళ్లీ నిర్వహించడంపై నిర్వహణపై కమిషన్‌  చర్చించింది. లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్‌ నిర్వహించే పరీక్షలను మల్టీసెషన్ల విధానంలో నిర్వహించి, నార్మలైజేషన్‌ కింద మార్కులు లెక్కించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షపై చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో ఒకేసారి 40 వేల మందికి మాత్రమే సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఈ లెక్కన 3.8 లక్షల మందికి పరీక్ష నిర్వహించేందుకు దాదాపు పదిరోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టును సృష్టించి, ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ అప్పగించింది. గ్రూప్‌-1 రాత పరీక్ష ప్రక్రియను ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది.

తెలంగాణ తొలి గ్రూప్‌-1 కింద అత్యధికంగా 503 ఉద్యోగాలతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దుచేసి, జూన్‌ 11న తిరిగి నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు ఆ పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పరీక్ష యథావిధిగా నిర్వహించేందుకు కమిషన్‌ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసింది. త్వరలోనే గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రవేశపత్రాలను వెబ్‌సైట్లో పొందుపరచనుంది. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్-టీఎస్పీఎస్సీ జూన్ 11వ తేదీన నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతు హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే గురువారం ఉదయమే రిట్ పిటిషన్ జస్టిస్ కె. లక్ష్మణ్ తో కూడిన హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. కాగా, తన కుమార్తె కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల రాసినందున తాను పిటిషన్ ను విచారించలేనని జస్టిస్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. పిటిషన్ ను మధ్యాహ్నం మరో బెంచ్ కు పంపిస్తానని వివరించారు. లంచ్ తర్వాత జస్టిస్ పుల్లా కార్తీక్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ వెళ్లగా విచారణ జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

Also Read:

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు!ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెంగా ఊపారు. కాగా బుధవారం (మే 25) ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్!ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వుం శుభవార్త తెలిపింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తు్న్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించగా..అంతర్ జిల్లాల బదిలీల్లో స్పాస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Tags: TS High courtTSPSC Group1 ExamTSPSC Group1 Preliminary ExamTSPSC Group1 Prelims Examజాబ్స్

Recent Posts

  • తెలంగాణలో బీజేపీ- టీడీపీ కలిస్తే ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
  • రణబీర్ కపూర్ మంచి మనసు – వారికి
  • తన రిసెప్షన్ కు రావాలని కేసీఆర్ కు ఆహ్వానం అందించిన శర్వానంద్
  • చీరకట్టులో కృతి శెట్టి వయ్యారాలు
  • విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In