హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్‌టైన్‌మెంట్ Sonali Bendre Photos: యాభైకి దగ్గర్లో ఉంది ఎవరైనా నమ్ముతారా అసలు!
సోనాలీ బింద్రే
టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సోనాలీ బింద్రే. మహారాష్ట్ర కుటుంబంలో 1975 జనవరి 1న జన్మించింది. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్. ముంబైలో కొంతకాలం చదివిన సోనాలీ ఆ తర్వాత బెంగళూరులోనూ చదువు కొనసాగించింది. చదువుకొనే రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగేసిన బింద్రే ఎంట్రీ ఇచ్చిన ‘ఆగ్’ సినిమాతోనే ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది.
తెలుగులో సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం కృష్ణవంశీ ‘మురారి’. ఆ తర్వాత చిరంజీవితో ‘ఇంద్ర’, శంకర్ దాదా ఎమ్ బీ బీ ఎస్, బాలకృష్ణతో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ లో ఆకట్టుకుంది. కృష్ణవంశీ ‘ఖడ్గం’లో నువ్వు నువ్వు సాంగ్ లో సోనాలిని చూసి మైమరిచిపోయారు సినీ ప్రియులు.
దర్శకనిర్మాత, రచయిత గోల్డీ బెహెల్ ను పెళ్లిచేసుకుంది. వీరికి ఓ అబ్బాయి, పేరు రణవీర్. ఆనందంగా సాగుతున్న సోనాలీ జీవితంలో కేన్సర్ కల్లోలం రేపింది. ధైర్యంగా ఆ వ్యాధిని జయించిన సోనాలి ఎందరికో స్ఫూర్తి కలిగించింది.
సోనాలీ బింద్రే (Image Credit: Sonali Bendre/ Instagram)

Tags: sonali bendre movies sonali bendre family sonali bendre son sonali bendre photos