• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home పాలిటిక్స్

ఏపీలో జనంలోకి వెళ్తున్న బీజేపీ – వరుస కార్యక్రమాలు ! బలోపేతం అవుతారా ?

BhanuGopal Ch by BhanuGopal Ch
May 27, 2023
in పాలిటిక్స్
0 0
0
ఏపీలో-జనంలోకి-వెళ్తున్న-బీజేపీ-–-వరుస-కార్యక్రమాలు-!-బలోపేతం-అవుతారా-?

 

AP BJP :    వైసీపీ సర్కారు  వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టేందుకు జిల్లాల వారీగా బీజేపీ కార్యాచరణ రూపొందించుకుంది.  ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగడుతూనే..రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని మోడీ పాత్రను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫ ల్యాలు, ప్రజా ప్రతినిధుల అవినీతిపై చార్జిషీటు కార్యక్రమాన్ని చేపట్టారు. పలు జిల్లాల్లో ప్రజలను భాగస్వాములను చేసి అభి యోగపత్రాల నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహిం చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందంటూ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మరో వైపు నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఏపీకి చేసిన సాయం ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నవ వసంతంపై విష్ణువర్దన్ రెడ్డి నేతృత్వంలో ప్రచారం

 ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలు, ఏపీకి చేసిన మేళ్లపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్థన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రచా ర కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టిన మే 30 నుంచి జూన్‌ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రధా నంగా దేశం సాధించిన పురోగతి, అంత ర్జాతీయ స్థాయిలో దేశానికి వచ్చి న పేరు ప్రతిష్టలు, ఏపీకి వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇచ్చి న రూ.లక్షల కోట్ల సా యం వంటి పలు అం శాలను ప్రజల్లోకి తీసు కెళ్లనున్నారు. శక్తి కేం ద్రాల స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో పా టు జిల్లా, రాష్ట్ర స్థాయి లో వివిధ రూపాల్లో ప్ర త్యేక కార్యక్రమాలు చేపట్ట నున్నారు. రెండు మూడు రోజు ల్లో నవ వసంత విజయాలపై రూ పొందించిన కార్యచారణ ప్రకటించనున్న ట్లు పార్టీ నేతలు చెపుతున్నారు.

ప్రభుత్వంపై పోరాటం  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా ప్రతినిధుల అవినీతిపై బీజేపీ ఈ నెల మొదటి వారం నుంచి 19వ తేదీ వరకు నిర్వహం చిన చార్జిషీటు ఉద్యమం విజయవంతంపై నేతలు ఉత్సాహం గా ఉన్నారు. మండల స్థాయి నుంచి జిల్లాల స్థాయి, ఆపై రాష్ట్రస్థాయి వరకు చేపట్టిన చార్జిషీటు ఉద్యమంలో ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేశారు. 20వేల మందికి పైగా ప్రజలు బీజేపీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని అభి యోగాలు చెప్పారు. నెల్లూరు వంటి జిల్లాల్లో పోలీసుల నిర్బం ధాన్ని సైతం తట్టుకొని ప్రజల దృష్టిని ఆకర్షించగలిగామని బీజేపీ నేతలు చెపుతున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై పోరు..మరో వైపు మోడీ సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు జిల్లా స్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట 26 జిల్లాలకు కొత్త ఇన్‌చార్జిల నియామకం పూర్తి చేశారు. వీరికి పలు కీలక బాధ్యతలను అప్పచెప్పారు. 

బీసీలపై గురి పెట్టిన బీజేపీ  రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్నట్లు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. బీసీ కార్పోరేష న్లు మినహా వారికి చేసిన మేళ్లు లేవంటూ అధికార పార్టీని కా ర్నర్‌ చేస్తోంది. దేశ ప్రధానిగా బీసీ సామాజిక వర్గానికి చెం దిన నరేంద్ర మోడీని ప్రధాని చేసిన పార్టీగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే బీసీలకు చేరవయ్యేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. రాయ లసీమ జిల్లాలకు సంబంధించి కర్నూ లు కేంద్రంగా ఈ నెల 28 బీసీ సమావేశం నిర్వహిస్తోంది. మరో వైపు వచ్చే నెలలో విశాఖ పట్టణంలో పెద్ద ఎత్తున బీసీలను సమీకరించి కార్యక్రమం నిర్వహించేందుకు రూపకల్పన చేస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కే.లక్ష్మణ్‌తో పాటు కేంద్ర, రాష్ట్రస్థాయి బీసీ నేతలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ఏపీ బీజేపీ కార్యాచరణ రూపొందించింది.

Tags: AP BJPAP PoliticsSomu VarrajuVishnuvardhan Reddyపాలిటిక్స్

Recent Posts

  • ఆకలిగా ఉండటం లేదా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది ముందస్తు లక్షణం
  • హీరో విజయ్ కీలక నిర్ణయం – ఆ విద్యార్థులకు సాయం
  • Papedabba Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
  • రూ.24 వేల లోపే 200 మెగాపిక్సెల్ కెమెరా లాంచ్ చేసిన రియల్‌మీ – ప్రారంభ ఆఫర్లు అదుర్స్!
  • 50 కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం – ఏపీ, తెలంగాణకు ఎన్నంటే

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In