• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

ఫ్లైట్ గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్యాసింజర్,ఊపిరాడక ప్రయాణికులు విలవిల

BhanuGopal Ch by BhanuGopal Ch
May 26, 2023
in న్యూస్
0 0
0
ఫ్లైట్-గాల్లో-ఉండగా-ఎమర్జెన్సీ-డోర్-తెరిచిన-ప్యాసింజర్,ఊపిరాడక-ప్రయాణికులు-విలవిల

Watch Video: 

ఏషియానా ఫ్లైట్‌లో ఘటన..

విమానం గాల్లో ఉండగానే..ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్‌ని తెరవడం అందరినీ టెన్షన్ పెట్టింది.  Asiana Airlines ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు ఓ ప్రయాణికుడు. ఒక్కసారిగా ప్యాసింజర్స్‌ అందరూ ఉలిక్కిపడ్డారు. ఫ్లైట్ సేఫ్‌గానే ల్యాండ్ అయినప్పటికీ…డోర్ తెరవడం వల్ల గాలి గట్టిగా వీచి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ల్యాండ్ అయిన వెంటనే కొందరు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో Airbus A321-200లో 200 మంది ప్రయాణికులున్నారు. Daegu International Airport రన్‌వేపై ల్యాండ్ అయ్యే సమయంలో ఇది జరిగింది. ఎమర్జెన్సీ డోర్‌కి పక్కనే కూర్చుని ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లైట్…నేలకు 650 అడుగుల ఎత్తులో ఉండగానే మాన్యువల్‌గా ఆ డోర్‌ని తీశాడు. అనుకోకుండా డోర్ ఓపెన్ అవడం వల్ల ప్రయాణికులంతా కంగారు పడ్డారు. శ్వాస తీసుకోవడంలో చాలా మంది ఇబ్బందికి గురయ్యారు. అయితే..ఎవరికీ గాయాలు అవ్వలేదని, ఫ్లైట్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదని ఏషియానా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. సౌత్‌కొరియాకు చెందిన Yonhap News Agency ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపింది. 9 మందిని ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించింది. ఆ డోర్‌ని ఓపెన్ చేసిన ప్యాసింజర్‌ని పోలీసులకు అప్పగించారు. ఇలా ఎందుకు చేశాడో విచారిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

🚨 Un pasajero ha abierto una salida de emergencia del #A321 HL8256 de #AsianaAirlines en pleno vuelo.El vuelo #OZ8124 entre Jeju y Daegu del 26 de mayo se encontraba en aproximación cuando una de las salidas de emergencia sobre el ala fue abierta por un pasajero.El avión… pic.twitter.com/G0rlxPNQuW

— On The Wings of Aviation (@OnAviation) May 26, 2023 విమానంలో కుదుపులు..

ఇటీవల ఢిల్లీ-సిడ్నీ ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ గాల్లో ఉండగానే ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయానికే…మెడికల్ అసిస్టెన్స్ సిద్ధంగా ఉంచారు. ఎవరినీ ఆసుపత్రిలో చేర్చాల్సినంత తీవ్రంగా గాయాలు కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పష్టం చేసింది. గాయాలు తీవ్రంగా కాకపోయినా చాలా చోట్ల దెబ్బలు తాకినట్టు అధికారులు వెల్లడించారు. తీవ్రస్థాయిలో కుదుపులకు లోనవడం వల్లే ఇలా జరిగిందని వివరించారు.

“Air India B787-800 ఎయిర్‌క్రాఫ్ట్‌ గాల్లో ఉండగానే భారీ కుదుపులకు లోనైంది. దాదాపు ఏడుగురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో స్పల్పంగా గాయపడ్డారు. ఫ్లైట్‌లో ఉండగానే వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఓ డాక్టర్‌తో పాటు నర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో వాళ్లకు చికిత్స చేశారు

– డీజీసీఏ

Also Read: Sengol Politics: రాజదండంపై రాజకీయాలు, కాంగ్రెస్ అలా బీజేపీ ఇలా – ఇంతకీ ఏది నిజం?

Tags: Asiana AirlinesDaegu International AirportEmergency Exit DoorFlight Emergency DoorMid AirViral videowatch videoన్యూస్

Recent Posts

  • తెలంగాణలో బీజేపీ- టీడీపీ కలిస్తే ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
  • రణబీర్ కపూర్ మంచి మనసు – వారికి
  • తన రిసెప్షన్ కు రావాలని కేసీఆర్ కు ఆహ్వానం అందించిన శర్వానంద్
  • చీరకట్టులో కృతి శెట్టి వయ్యారాలు
  • విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ – లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In