నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: జగన్
అమరావతిలోని ఆర్-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడి జగన్…. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇంకా చదవండి
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు – హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు !
వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు… జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఇంకా చదవండి
ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ అనేక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి 22 వరకు జరగనున్న ఏ రోజు కారోజు రోజువారీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి ప్రత్యేకంగా చెప్పారు. మంత్రులు, శాసనస భ్యులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఇంకా చదవండి
పార్లమెంట్‌ని ప్రధాని ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్, తిరస్కరించిన సుప్రీంకోర్టు
కొత్త పార్లమెంట్‌ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఓ లాయర్ పిటిషన్ వేశారు. ఇవాళ పిటిషన్ల లిస్ట్‌లో ఇది ఉన్నప్పటికీ…సర్వోన్నత న్యాయస్థానం విచారణకు అంగీకరించలేదు. పైగా…ఇలాంటి పిటిషన్ వేసినందుకు అసహనం వ్యక్తం చేసింది. “ఇలాంటి పిటిషన్ వేసినందుకు మేమెందుకు మీకు ఫైన్ వేయకూడదు..”? అని వ్యాఖ్యానించింది. విచారణ సమయంలో ధర్మాసనం అసహనానికి గురైంది. ఈ విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. ఇది సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సిన విషయం కాదని స్పష్టం చేసింది. ఇంకా చదవండి
డైరెక్షన్ ఫీల్డ్‌లోకి నటి కీర్తి సురేశ్ సోదరి
న్యాచురల్ నానితో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దసరా’తో మంచి హిట్ కొట్టింది కీర్తి సురేష్. అయితే, ఆమె సోదరి రేవతి సురేష్ కూడా సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. కానీ, ఆమె రూటు మార్చింది. దర్శకురాలిగా తన లక్ పరీక్షించుకోడానికి వస్తోంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపింది.
ఈ సందర్బంగా తన సోదరి చేయబోయే షార్ట్ ఫిల్మ్‘థ్యాంక్యూ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కీర్తి సురేశ్ షేర్ చేసింది. “నా సోదరి స్వీట్ షార్ట్ ఫిల్మ్ ‘థ్యాంక్యూ’కి దర్శకురాలిగా అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. రేవతి నీకు లవ్ ఇంకా హగ్స్ పంపుతున్నాను. సురేష్ కుమార్, నితిన్ మోహన్ లు నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అంటూ ఆమె పోస్టులో రాసుకొచ్చారు. కీర్తి లాగే ఆమె సోదరి రేవతి కూడా చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవాలని, విజయాలను అందుకోవాలనీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వైరల్ అవుతోన్న ఈ పోస్ట్ పై స్పందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్స్ రేవతికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇంకా చదవండి