• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home టెక్నాలజీ

రూ.75 కాయిన్ విడుదల చేయనున్న ప్రధాని మోదీ, పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజునే

BhanuGopal Ch by BhanuGopal Ch
May 26, 2023
in టెక్నాలజీ, న్యూస్
0 0
0
రూ.75-కాయిన్-విడుదల-చేయనున్న-ప్రధాని-మోదీ,-పార్లమెంట్-ప్రారంభోత్సవం-రోజునే

Rs 75 Coin:

రూ.75 కాయిన్ విడుదల..

ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పక్కా షెడ్యూల్ ప్రకారం ఈ తంతు జరగనుంది. ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.75 కాయిన్‌ని విడుదల చేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ కాయిన్‌ని విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రత్యేక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ కాయిన్‌ వివరాలనూ వెల్లడించింది. 44 మిల్లీమీటర్ల డయామీటర్‌తో ఉంటుందని తెలిపింది. ఈ కాయిన్‌ని 50% వెండి, 40% రాగి, 5%నికెల్‌, 5% జింక్‌తో తయారు చేశారు. 

“కాయిన్‌పై అశోక పిల్లర్‌తో పాటు దానిపై పులి బొమ్మ ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అనే నినాదం రాసి ఉంటుంది. ఎడమ వైపున  “Bharat” అని మెన్షన్ చేశాం. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. కుడివైపు ఇంగ్లీష్‌లో “INDIA” అని కనిపిస్తుంది. మరో వైపు పార్లమెంటరీ కాంప్లెక్స్ బొమ్మ ప్రింట్ అయ్యుంటుంది. పార్లమెంటరీ కాంప్లెక్స్‌ స్క్రిప్ట్‌పై సన్సన్ సంకుల్ అని రాసి ఉంటుంది.”

– నోటిఫికేషన్ 

 

Ministry of Finance to launch a special Rs 75 coin to commemorate the inauguration of the new Parliament building on 28th May. pic.twitter.com/NWnj3NFGai

— ANI (@ANI) May 26, 2023 కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు ముదిరాయి. అన్ని పార్టీలనూ ఆహ్వానించామని బీజేపీ చెబుతున్నప్పటికీ.. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు విపక్షాలు ఆసక్తి చూపించడం లేదు. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. కొత్త పార్లమెంట్‌ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతికి తగిన గౌరవం కల్పించాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్‌సభ సెక్రటేరియట్ రాజ్యాంగ విలువల్ని కించపరిచారని ఆరోపించారు. లాయర్ జయసుకీన్ ఈ  పిటిషన్ వేశారు. ఇప్పటికే 19 పార్టీలు తాము హాజరు కావడం లేదని లెటర్ రాశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత మాత్రమే పార్లమెంట్‌ని ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశాయి. కానీ…బీజేపీ మాత్రం దీనిపై గట్టిగానే వాదిస్తోంది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యుటీ ఛైర్మన్ పాల్గొంటారు. ఉదయం 7.30 గంటలకు హవన్ పూజ మొదలవుతుంది. 8.30 గంటల వరకూ ఇది కొనసాగుతుంది. 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో సెంగోల్‌ (Sengol)ని లోక్‌సభలో పొందుపరచనున్నారు. ఈ మొత్తం తంతులో ఇదే హైలైట్ అవనుంది. ఆ తరవాత 12 గంటలకు పార్లమెంట్‌ని ప్రారంభించి ప్రసంగిస్తారు ప్రధాని. 

Also Read: Amit Shah On 2024 Elections: 300లకు పైగా సీట్లతో మరోసారి బీజేపీదే అధికారం – మోదీయే ప్రధాని: షా

Tags:  New Parliament InaugurationNew Parliament BuildingPM ModiRs 75 coinన్యూస్

Recent Posts

  • ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా – లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
  • రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ – ఐపీఎల్ చరిత్రలోనే!
  • తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు – ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!
  • బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!
  • 12:10కి ప్రారంభం కానున్న గేమ్ – ఓవర్లు 15కు కుదింపు – చెన్నై టార్గెట్ ఎంతంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In