IPL 2023, GT vs MI:
ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ -2 టాస్ వేశారు. మొతేరా వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వర్షం కురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించాడు.
🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @gujarat_titans in Ahmedabad.Follow the match ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/BdK4DQl7Qr
— IndianPremierLeague (@IPL) May 26, 2023 ‘మేం ఛేజ్ చేస్తాం. పిచ్ బాగుంది. వికెట్‌ను మెరుగ్గా ఉపయోగించుకుంటాం. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ మరింత మెరుగు అవుతుంది. మా ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. ఈ సీజన్లో మేం టార్గెట్లను బాగా ఛేదించాం. సరికొత్త జట్టును నిర్మించుకున్నాం. కొత్తవాళ్లు వచ్చారు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం. శక్తి మేరకు ఆడాల్సిన మ్యాచ్ ఇది. టోర్నీ ఆరంభంలో కాస్త ఆందోళన చెందాం. కానీ ఇప్పుడు స్థిరత్వం వచ్చింది. హృతిక్ షోకీన్ ప్లేస్‌లో కుమార్ కార్తికేయను తీసుకున్నాం’ అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
An energetic Captain @hardikpandya7 leads the huddle talk for @gujarat_titans ahead of the BIG game 🙌🙌#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/1L6TOVgvKz
— IndianPremierLeague (@IPL) May 26, 2023 ‘టాస్ గెలిస్తే మేమూ బౌలింగే తీసుకొనేవాళ్లం. నాకౌట్స్, క్వాలిఫయర్స్ ఫన్నీగా ఉంటాయి. అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టాల్సి ఉంటుంది. అలాగే మ్యాచ్‌ను ఆస్వాదించాలి. శక్తిమేరకు ఆడితే ఎలాంటి ఫలితం వచ్చినా సంతోషమే. అభిమానులు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. గుజరాత్ ప్రజలు నమ్మకంగా ఉంటారు. రెండు మార్పులు చేశాం. శనక, నల్కండే స్థానాల్లో జోష్ లిటిల్, సాయి సుదర్శన్ వచ్చారు’ అని గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్య అన్నాడు.
ముంబయి ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జేసన్ బెరెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమి
UPDATE:👉Toss to take place at 7:45PM IST 👉Start of Play at 8 PM IST#TATAIPL | #Qualifier2 | #GTvMI https://t.co/cIJJSar5Oy
— IndianPremierLeague (@IPL) May 26, 2023