• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

రాజదండంపై రాజకీయాలు, కాంగ్రెస్ అలా బీజేపీ ఇలా – ఇంతకీ ఏది నిజం?

BhanuGopal Ch by BhanuGopal Ch
May 26, 2023
in న్యూస్
0 0
0
రాజదండంపై-రాజకీయాలు,-కాంగ్రెస్-అలా-బీజేపీ-ఇలా-–-ఇంతకీ-ఏది-నిజం?

Sengol Politics: 

సెంగోల్‌పై రాజకీయాలు..

నిన్న మొన్నటి వరకూ కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్. ఆ ఎన్నికల ఫలితాలు పొలిటికల్ హీట్‌ పెంచేశాయి. అప్పుడు రాజుకున్న మంట ఇంకా చల్లారలేదు. ఆ వెంటనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్యల వర్డ్ వార్ మొదలైంది. ప్రధాని మోదీ పార్లమెంట్‌ని ప్రారంభించడంపైనే కాదు. సెంగోల్‌ని (Sengol) పార్లమెంట్‌లో అమర్చుతామన్న నిర్ణయమూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార బదిలీకి సంబంధించి, మన దేశ స్వాతంత్య్రంతో ముడిపడిన ముఖ్యమైన ఆ రాజదండానికి పార్లమెంట్‌లో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతోంది బీజేపీ. అటు కాంగ్రెస్ మాత్రం “ఇదంతా బోగస్” అని తేల్చి పారేస్తోంది. అధికార బదిలీలో భాగంగానే సెంగోల్‌ని నెహ్రూకి ఇచ్చారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తోంది. అసలు విషయాన్ని పక్కన పెట్టి తమిళనాడులో నిలదొక్కుకోడానికి బీజేపీ ఇలాంటి కొత్త వాదన వినిపిస్తోందని ఆరోపిస్తోంది.

బీజేపీ వాదన ఇలా..

దీనికి  బీజేపీ నేతలు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. స్వయంగా కేంద్రమంత్రి అమిత్‌షానే రంగంలోకి దిగి వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు. భారత దేశ సంస్కృతి అంటే కాంగ్రెస్‌కి ఎందుకంత విద్వేషం అంటూ మండి పడ్డారు. మే 28వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఛైర్‌కు సమీపంలో ఈ సెంగోల్‌ని పొందుపరచనున్నారు. 

“భారతీయ సంస్కృతి అంటే కాంగ్రెస్‌కి ఎందుకంత విద్వేషం? పవిత్రమైన సెంగోల్‌ని తమిళనాడులోని ఓ శైవ మఠంలో అప్పటి ప్రధాని నెహ్రూకి అందజేశారు. అధికార బదిలీకి చిహ్నంగా ఈ తంతు నిర్వహించారు. కానీ…దానికి విలువనివ్వకుండా మ్యూజియంలో పెట్టారు. కేవలం దాన్ని ఓ వాకింగ్ స్టిక్‌లా చూశారు. కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు. ఆ శైవమఠమే స్వయంగా సెంగోల్‌కి ఉన్న పవిత్రతను వివరించింది. అయినా..కాంగ్రెస్ బోగస్ అని అనడం అవమానకరం”

– అమిత్ షా, కేంద్రహోం మంత్రి

Why does the Congress party hate Indian traditions and culture so much? A sacred Sengol was given to Pandit Nehru by a holy Saivite Mutt from Tamil Nadu to symbolize India’s freedom but it was banished to a museum as a ‘walking stick’.

— Amit Shah (@AmitShah) May 26, 2023

Now, Congress has heaped another shameful insult. The Thiruvaduthurai Adheenam, a holy Saivite Mutt, itself spoke about the importance of the Sengol at the time of India’s freedom. Congress is calling the Adheenam’s history as BOGUS! Congress needs to reflect on their behaviour.

— Amit Shah (@AmitShah) May 26, 2023

కాంగ్రెస్ వాదన మరోలా..

అయితే…అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీవి కేవలం రాజకీయ ఎత్తుగడలే అని విమర్శిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“తమిళనాడులో తమ ఉనికిని చాటుకోవడం కోసం ఈ సెంగోల్‌ని తెరపైకి తీసుకొచ్చారు. నిజాలను పక్కన పెట్టి వాటికి కొత్త అర్థాలు చెబుతున్నారు. ఓ మత సంస్థ 1947 ఆగస్టులో నెహ్రూకి ఇది బహూకరించింది. అప్పట్లో మద్రాస్‌ సిటీలో దీన్ని తయారు చేశారు. అంతే తప్ప…మౌంట్‌బట్టెన్ నెహ్రూకి అధికార బదిలీకి చిహ్నంగా ఇది ఇచ్చారనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాల్లేవు. బీజేపీ చెబుతున్నదంతా బోగస్. ఇది కేవలం బీజేపీ బలవంతంగా రుద్దుతున్న నిజం. వాట్సాప్ యూనివర్సిటీల్లోనూ ఇదే ప్రచారం చేస్తున్నారు”

– జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 

Is it any surprise that the new Parliament is being consecrated with typically false narratives from the WhatsApp University? The BJP/RSS Distorians stand exposed yet again with Maximum Claims, Minimum Evidence. 1. A majestic sceptre conceived of by a religious establishment in… pic.twitter.com/UXoqUB5OkC

— Jairam Ramesh (@Jairam_Ramesh) May 26, 2023 Also Read: Rs 75 Coin: రూ.75 కాయిన్ విడుదల చేయనున్న ప్రధాని మోదీ, పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజునే

Tags: BJPCONGRESSNew Parliament BuildingNew Parliament OpeningSengolSengol InstallationSengol Politicsన్యూస్

Recent Posts

  • ‘ఎంగేజ్’తో రానున్న మారుతి – అత్యంత ఖరీదైన కారుగా!
  • నవ్య స్వామి లేటెస్ట్ ఫోటోలు చూశారా – ఎంత అందంగా ఉందో!
  • 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య
  • రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ – ఇండియాలో కాదు
  • సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In