అమరావతిలోని ఆర్-5జోన్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు.
సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీల్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం 25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది
ఈ సందర్భంగా మాట్లాడి సీఎం జగన్… ఇళ్ల స్థలాల కోసం చాలా పోరాటాలు జరిగాయి. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సుదీర్ఘ న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్లి యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్న అద్భుతం అమరావతిలో చూస్తున్నాం. ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం అంటుంటే రాక్షసులు సుప్రీం కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. 50,793 మందికి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన చేసి ఇస్తున్న అవకాశం కల్పించిన దేవుడికి ఎప్పుడూ రుణపడే ఉంటాను.
ఈ ప్రాంతంలో గజం కనీసం 15 నుంచి 20 వేలు ఉంటుదట. అంటే ఏడు లక్షల నుంచి పది లక్షలు విలువ చేసే స్థలం పేదల పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది వాళ్లకు ఇస్తున్నవి హక్కులు మాత్రమే కాదు… సామాజిక న్యాయపత్రాలు కూడా ఇస్తున్నాం. ఇకపై ఇదే అమరావతి సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందన్నారు.