• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home సినిమా

B

sastra_admin by sastra_admin
May 26, 2023
in సినిమా
0 0
0
b

బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత కాలంగా ప్రొడ్యూసర్ గా అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల బండ్ల తన ట్వీట్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన, లేటెస్టుగా ‘గురూజీ’ అంటూ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

తాజాగా బండ్ల గణేష్ గుడ్ మార్నింగ్ చెబుతూ ఓ కొటేషన్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ట్వీట్ కి ఓ నెటిజన్ స్పందిస్తూ, ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని వుంది’ అని అడిగాడు. దీనికి బండ్ల గణేష్ రియాక్టు అవుతూ ‘గురూజీని కలవండి.. ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వండి.. అప్పుడు అది నెరవేరుతుంది’ అని ట్వీట్ చేశారు. ఈ సమాధానమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  

ప్రస్తుతం టాలీవుడ్ లో ‘గురూజీ’ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియాలోనూ త్రివిక్రమ్ కు గురూజీ అనే ఉపమానం వాడుతుంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ ట్వీట్ లో గురూజీ అని ప్రస్తావించడంతో, అది త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ పెట్టిందే అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనకి ఏదైనా ఖరీదైన గిఫ్ట్ ఇస్తే నిర్మాత అయిపోవచ్చని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారనీ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి ఒకప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ తో బండ్ల గణేష్ కు మంచి బాండింగ్ వుంది. వీరిద్దికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం కూడా ఉండేది. బండ్ల నిర్మించిన ‘తీన్ మార్’ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య దూరం పెరిగిందనే టాక్ ఉంది. దీనికి తగ్గట్టుగానే ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో త్రివిక్రమ్ పై బండ్ల షాకింగ్ కామెంట్స్ చేసినట్లు ఓ ఆడియో లీక్ అయింది. 

Meet Guruji & give costly gift it will happen 😜 https://t.co/BdvLvTwbbs

— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023

అందులో త్రివిక్రమ్ ను బండ్ల గణేష్ అసభ్య పదజాలంతో దూషించినట్లు ఉంది. తనని ప్రీరిలీజ్ ఈవెంట్ కి రానివ్వకుండా త్రివిక్రమ్ అడ్డుపడుతున్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వినిపించింది. తనకు ఈవెంట్ కు రావాలని ఉందని.. స్పీచ్ కు రెడీ చేసుకున్నానని, ఆడిటోరియంలో అందరూ బండ్లన్న రావాలి అని గట్టిగా అరిస్తే అక్కడ ప్రత్యక్షమవుతానన్నారు. 

అదే కాదు భార్యాభర్తల్ని. తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే అది మన గురూజీ స్పెషాలిటీ 😝 https://t.co/P6J844y0fa

— BANDLA GANESH. (@ganeshbandla) May 26, 2023

బండ్ల ఆడియో ఎంత వరకూ నిజం అనుకుంటుండగా, ఆయన భీమ్లా ఈవెంట్ లో కనిపించలేదు. దీంతో ఆ రూమర్స్ నిజమేనని అని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పుడు బండ్ల తాజా ట్వీట్ లో పేర్కొన్న ‘గురూజీ’ త్రివిక్రమ్ నే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తున్న రీమేక్ సినిమా వ్యవహారాలన్నీ త్రివిక్రమ్ చూస్తున్నారనే పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురూజీకి ఖరీదైన గిఫ్ట్ ఇస్తే నిర్మాత అయిపోవచ్చని బండ్ల ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

Read Also: ఇలా వచ్చాడో లేదో, అలా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు – యంగ్ హీరోకు మహేష్ బాబు బంపర్ ఆఫర్!

Tags: Bandla GaneshBandla Ganesh TweetGurujiTrivikramtrivikram srinivasసినిమా

Recent Posts

  • ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా – లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
  • రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ – ఐపీఎల్ చరిత్రలోనే!
  • తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు – ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!
  • బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!
  • 12:10కి ప్రారంభం కానున్న గేమ్ – ఓవర్లు 15కు కుదింపు – చెన్నై టార్గెట్ ఎంతంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In