• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

నేడు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ – నేటి టాప్ 10 న్యూస్ మీకోసం

sastra_admin by sastra_admin
May 25, 2023
in న్యూస్, పాలిటిక్స్
0 0
0
నేడు-అవినాష్-ముందస్తు-బెయిల్-పిటిషన్-విచారణ-–-నేటి-టాప్-10-న్యూస్-మీకోసం

జగన్ బెస్ట్ అన్న ఈటల – పూర్తిగా ఫెయిలయ్యారన్న సోము వీర్రాజు ! ఎవరు నిజం?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ లక్షలాది ఇళ్లు కట్టిస్తున్నారని కానీ తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూం పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని బీజేపీ నేతల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈటల మాటల్ని వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. దీనికి కారణం కొద్ది రోజుల కిందటే ఏపీ బీజేపీ నిర్వహించిన ప్రజా చార్జిషీట్‌ ఉద్యమంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని ఫిర్యాదు చేశారు. ఇళ్ల నిర్మాణాల్లో పొరపాటు, అలసత్వం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. ప్రధాని ఆవాస్ యోజన అని బోర్డు పెట్టడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఏపీలో ఇళ్ల పరిస్థితి చూడాలని కోరామన్నారు.  దానికి భిన్నంగా ఈటల స్పందించారు. ఇంకా చదవండి

నేడే తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్, ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు నేడే (మే 25)న విడుదల కానున్నాయి. నేడు ఉదయం 9.30 గంటలకి విడుదల కానున్నాయి. తొలుత ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, అదే సమయానికి రాష్ట్ర అవతరణ వేడుకలపై సీఎం కేసీఆర్‌తో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండడం, అందులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండడంతో ఎంసెట్ ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు. ఇంకా చదవండి

నేడు విచారణకు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌, కోర్టు నిర్ణయంపై ఆసక్తి

వైఎస్ఆర్ సీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. నేడు (మే 25) తెలంగాణ హైకోర్టులో నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చేయనున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు‌ వెకేషన్ బెంచ్‌ విచారణ చేసేలా ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసి తీర్పు చెప్పాలని హైకోర్టు‌ను రెండు రోజుల క్రితం ఆదేశించింది. ఆ ప్రకారం నేడు (మే 25) అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది. ఇంకా చదవండి

కంగ్రాట్స్ మోదీజీ, చారిత్రక ఘట్టానికి వైసీపీ హాజరు అవుతుంది – సీఎం జగన్ ట్వీట్

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా రాజకీయం జరుగుతోంది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని.. తాము ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని 19 విపక్ష పార్టీలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి వైసీపీ హాజరు అవుతుందని స్పష్టం చేశారు. ఇటీవల నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ అభినందనలు తెలిపారు. తాము మహత్తర ఘట్టానికి హాజరవుతామని ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇంకా చదవండి

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అన్నా చెల్లెళ్లు సహా ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసింది. తాజా అరెస్టులతో  పేపర్ల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 39కి చేరింది. డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్ (DAO) పేపర్ కొన్న విక్రమ్, దివ్యలతో రవి కిషోర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. విక్రమ్, దివ్యలు అన్నా చెల్లెళ్లు, కాగా వీరిది నల్గొండ జిల్లా. రవి కిషోర్ ఏఈ పేపర్ విక్రయించాడని అరెస్ట్ చేసింది సిట్. రవి కిషోర్ దాదాపు 70, 80 మందికి పేపర్ విక్రయించాడని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఇంకా చదవండి

బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు

నందమూరి బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌గా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న బాలక్రిష్ణకు అభినందనలు తెలిపారు. అవుట్ లుక్ మ్యాగజైన్ దేశంలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్స్ జాబితాను విడుదల చేయగా, అందులో బసవతారకం ఆస్పత్రి రెండో స్థానంలో నిలిచింది. ఇంకా చదవండి

జీవో 111 ఎత్తివేత వెనుక భారీ ఇన్‌సైడ్ ట్రేడింగ్, మేం ఎన్జీటీకి వెళ్తాం – రేవంత్ రెడ్డి

ఔటర్‌ రింగ్‌ రోడ్డును సీఎం కేసీఆర్‌ పర్యవేక్షణలోనే తెగనమ్మారని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని, ఇప్పుడు మరో దోపిడీకి తెర తీశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని, అంటే రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇవి చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని విమర్శించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 26వ తేదీలోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10 శాతం నిధులు చెల్లించాల్సి ఉందని అన్నారు. లేదంటే సంస్థకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా చదవండి

రిస్క్‌ చేయకుండానే రెగ్యులర్‌ ఇన్‌కం సంపాదించొచ్చు, చాలా స్కీమ్‌లు ఉన్నాయి

ప్రస్తుతం, మార్కెట్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లు కనిపిస్తున్నాయి. షేర్ల నుంచి బంగారం వరకు, మ్యూచువల్‌ ఫండ్ల నుంచి రియల్‌ ఎస్టేట్‌ వరకు చాలా రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడిదార్లలో కొందరిది షార్ట్‌కట్‌ రూట్‌. ఎక్కువ రిస్క్ తీసుకుని, షార్ట్ టర్మ్‌లో డబ్బు సంపాదించాలనుకుంటారు. మరికొందరిది స్ట్రెయిట్‌ రూట్‌. తక్కువ రిస్క్‌తో, దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా డబ్బు సంపాదనను ఇష్టపడతారు. రెండో కోవకు చెందిన వ్యక్తుల కోసం కొన్ని పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిలో డబ్బులు మదుపు చేస్తే, క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.

స్టాక్స్‌, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్‌, రియల్ ఎస్టేట్, రిటైర్‌మెంట్ పథకాలు లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌గా ప్రాచుర్యం పొందాయి. ఇవి కాకుండా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈక్విటీ ఫండ్స్‌లో కూడా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టవచ్చు. ఇంకా చదవండి

‘2018’ రివ్యూ : మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన సినిమా – ఎలా ఉందంటే?

మలయాళంలో వసూళ్ళ రికార్డులు తిరగరాస్తున్న సినిమా ‘2018’. థియేటర్లలో ఈ నెల 5న విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో చిరుజల్లులా మొదలైన చిత్రమిది. ఇంకా వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. ఒక్క మలయాళంలోనే వంద కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసు ఈ శుక్రవారం (మే 26న) విడుదల చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైన ‘మిన్నల్ మురళి’, ‘కాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన టోవినో థామస్ (Tovino Thomas) ఇందులో హీరో. ‘ఆకాశమే నీ హద్దురా’ ఫేమ్ అపర్ణా బాలమురళి (Aparna Balamurali) ఓ పాత్ర చేశారు. లాల్ సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయా? ఇంకా చదవండి

క్వాలిఫయర్-2కు ముంబై ఇండియన్స్ – లక్నోను నట్టేట ముంచిన నెహాల్!

ఐపీఎల్‌ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది. ఇంకా చదవండి

Tags: Telangana Headlines TodayTelangana LAtest NewsTelugu News TodayTS News Developments Todayన్యూస్

Recent Posts

  • నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
  • ఆశలన్నీ ఆదివారం పైనే – ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
  • ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ – లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!
  • విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
  • జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In