వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. వెకేషన్ బెంచ్ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్ రెడ్డి తన పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ తమ ముందుకు రావట్లేదని మరో బెంచ్‌కు వెళ్లాలని ఆ బెంచ్ సూచించింది. దీంతో మరో వెకేషన్ బెంచ్ ముందుకు అవినాష్ తరఫు న్యాయవాది వెళ్లారు.