• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home టెక్నాలజీ

హిరోషిమాలో జెలెన్‌స్కీ, ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ – ఏం చర్చించారు?

sastra_admin by sastra_admin
May 20, 2023
in టెక్నాలజీ, న్యూస్
0 0
0
హిరోషిమాలో-జెలెన్‌స్కీ,-ప్రధాని-మోదీ-ప్రత్యేక-భేటీ-–-ఏం-చర్చించారు?

PM Modi-Zelensky Meet: 

జపాన్ పర్యటనలో మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ G-7 సమ్మిట్‌కు హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిద ఆయనకు ఆహ్వానం పలికారు. జపాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా…అంతర్జాతీయ సమస్యల్నీ చర్చిస్తున్నారు. ముఖ్యంగా…పాక్, చైనాతో సరిహద్దు వివాదాలపై కీలక చర్చలు జరుగుతాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇదే క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే…ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తరవాత ఇద్దరు నేతలు కలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఇరు దేశాల దౌత్యవేత్తలు ఈ సమావేశంపై సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. రెండు వర్గాల అధికారులు సుదీర్ఘ చర్చల తరవాత ఈ భేటీ జరిగింది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్‌స్కీని కూడా జపాన్ ప్రధాని కిషిద G-7 సదస్సుకి ఆహ్వానించారు. గత నెల ఉక్రెయిన్ డిప్యుటీ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా భారత్‌ పర్యటనకు వచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఏడాదిన్నర తరవాత ఉక్రెయిన్‌కి చెందిన ఓ లీడర్‌ భారత్‌కు రావడం అదే తొలిసారి. యుద్ధాన్ని ఆపడంలో సహకరించి “విశ్వగురు” అనిపించుకోవాలని అప్పట్లోనే ఆమె ప్రధానికి విన్నవించారు. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ వచ్చారు ప్రధాని మోదీ. G-20 సదస్సులోనూ ఆయనతో మాట్లాడారు. ఈ  విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎటువైపూ నిలబడకుండా “శాంతినే కోరుకుంటున్నాం” అని చెబుతోంది. 

PM @narendramodi held talks with President @ZelenskyyUa during the G-7 Summit in Hiroshima. pic.twitter.com/tEk3hWku7a

— PMO India (@PMOIndia) May 20, 2023 శాంతివైపే ఉంటాం: ప్రధాని 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ఓ ఇంటర్వ్యూలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్‌ స్టాండ్ ఏంటని ప్రశ్నించగా…ఆసక్తికర సమాధానమిచ్చారు. “భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలబడుతుంది” అని తేల్చి చెప్పారు. ఆ రెండు దేశాల యుద్ధం కారణంగా…కొన్ని వస్తువుల ధరలు పెరిగాయని, వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్‌తో సమానంగా సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం కోసం ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవలే లేఖ రాశారు. భారత పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా ఏప్రిల్ 11వ తేదీన విదేశాంగ మంత్రి మీనాక్షి లేఖికి ఈ లేఖ అందజేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తన లేఖలో అదనపు మందులు, వైద్య పరికరాలను పంపడానికి సహాయం చేయాలని భారతదేశాన్ని అభ్యర్థించారు. తమ దేశంలో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులను పరీక్షలు రాయడానికి అనుమతి ఇస్తున్నట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి చెప్పారు, ఇది వేల మంది భారతీయ విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. భారత్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా మాట్లాడుతూ రష్యాకు అండగా నిలవడమంటే చరిత్రకు రాంగ్ సైడ్‌లో ఉండటమేనని, తమ దేశం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. 

Also Read: PM Modi Japan Visit: హిరోషిమాలో జపాన్ ప్రధానిని కలిసిన నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

Tags: Bilateral MeetJapanModi-Zelensky MeetPM ModiUkraine President Zelenskyన్యూస్

Recent Posts

  • నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
  • ఆశలన్నీ ఆదివారం పైనే – ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
  • ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ – లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!
  • విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
  • జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In