• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home హైదరాబాద్

వెర్రి వేయి విధాలు అంటే ఇదే, ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు: వీసీ సజ్జనార్

sastra_admin by sastra_admin
May 3, 2023
in హైదరాబాద్
0 0
0
వెర్రి-వేయి-విధాలు-అంటే-ఇదే,-ఇలా-చేస్తే-కఠిన-చర్యలు-తప్పవు:-వీసీ-సజ్జనార్

Bike Stunt: ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదకర స్థితిలో బస్సు వెనక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెర్రి వేయి విధానాలు అంటే ఇదే అంటూ తన పర్సనల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండని వీడియో ట్యాగ్ చేసి మరీ చెప్పారు. అలాగే ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండని చెప్పుకొచ్చారు.

వెర్రి వేయి విధాలు అంటే ఇదే!సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.#RoadSafety @MORTHIndia pic.twitter.com/24GFCp8vvX

— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 2, 2023

టీఎస్ఆర్టీసీ ఎండీ అనే అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మిధానీ డిపోనకు చెందిన బస్సు 104-ఎ రూట్లో ఆర్టీసీ బస్సు వెళ్తుండగా.. ఓ యువకుడు ద్విచక్ర వాహనం నడుపుతూ ఓ కాలుతో బస్సు వెనక భాగాన్ని నెడుతున్నట్లు ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. @TSRTCHQ https://t.co/AHSQQ7xbO9

— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 2, 2023

సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే సజ్జనార్..

బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ కు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ట్వీట్ చేశారు. అందులో మోసపూరిత కంపెనీలకు ప్రచారం చేయొద్దంటూ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఆమ్ వే వంటి కంపెనీలకు అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్థించారు. సెలబ్రిటీలు ఎరూ ఇలా చేయొద్దని అన్నారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్వవహరించడం సరికాదని సజ్జనార్ సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో క్యూనెట్ లాంటి గొలుసు కట్టు వ్యాపారం చేసే సంస్థలకు సంబంధించిన యాడ్స్ లలో నటించవద్దని, అలాంటి అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరారు. మరోవైపు అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మల్టీ లెవెన్ మార్కెటింగ్ ప్రమోటింగ్ కంపెనీ ఆమ్ వేపై 2022లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈడీ… ఆమే వే ఆస్తులను జప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. 

I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF

— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023

Tags: bike stuntSajjanar FiresTelangana NewsTSRTC MDViral videoహైదరాబాద్

Recent Posts

  • ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా – లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
  • రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ – ఐపీఎల్ చరిత్రలోనే!
  • తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు – ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!
  • బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!
  • 12:10కి ప్రారంభం కానున్న గేమ్ – ఓవర్లు 15కు కుదింపు – చెన్నై టార్గెట్ ఎంతంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In