Waranagal Preethi Case : కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ను కలిశారు. అనంతరం ప్రీతి తండ్రి నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. సీపీతో మాట్లాడి మా అనుమానాలు నివృత్తి చేసుకున్నామన్నారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నామని చెప్పారు. సిరంజి దొరికిందని సీపీ చెప్పారని, ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ విషయం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సీపీ చెప్పారన్నారు. కానీ రిపోర్ట్ చూపించలేదని తెలిపారు. పోలీసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందని నమ్ముతున్నామన్న ఆయన… ఛార్జ్ షీట్ లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారని తెలిపారు. కేఏంసీ ప్రిన్సిపాల్, హెచ్వోడీల బాధ్యతారాహిత్యం ఉందనుకుంటున్నామన్నారు.