Punjab Kings vs Mumbai Indians: ఐపీఎల్ 2023 సీజన్లో నేడు (శనివారం) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటింగ్‌కు దిగనుంది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టుఅథర్వ తైడే, ప్రభ్సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కరన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్నాథన్ ఎల్లిస్, మోహిత్ రాథీ, సికందర్ రజా, రిషి ధావన్, గుర్నూర్ బ్రార్
ముంబై ఇండియన్స్ తుది జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్రమణదీప్ సింగ్, కుమార్ కార్తికేయ, శామ్స్ ములానీ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా
A look at the Playing XIs in the #MIvPBKS contestFollow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/Ois7SP1W4k
— IndianPremierLeague (@IPL) April 22, 2023 🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @PunjabKingsIPL. Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/9awCR0HZTW
— IndianPremierLeague (@IPL) April 22, 2023 మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్లో బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ జరిగే వేదికలను ప్రకటించింది. ప్లేఆఫ్స్‌లో భాగంగా క్వాలిఫయర్ – 1, ఎలిమినేటర్ చెన్నైలో జరుగనుండగా క్వాలిఫయర్ – 2, ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. 2022లో కూడా ఫైనల్ (గుజరాత్ – రాజస్తాన్) అహ్మదాబాద్‌లోనే ముగియడం గమనార్హం.
మార్చి 31న మొదలైన ఈ సీజన్ లో లీగ్ దశ మ్యాచ్‌లు మే 21 వరకు జరుగనున్నాయి. మే 21న ముంబై – హైదరాబాద్, బెంగళూరు – గుజరాత్ తో ముగిసే మ్యాచ్‌లతో లీగ్ దశకు తెరపడుతుంది. అప్పటికి ఐపీఎల్ – 16 పాయింట్ల పట్టికలో టాప్ – 4 టీమ్స్ ప్లేఆఫ్స్ ఆడతాయి.
ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్, వేదికలు..
– మే 23న తొలి క్వాలిఫయర్ జరుగనుంది. టేబుల్ టాపర్స్ 1, 2వ స్థానాల్లో ఉన్న జట్లు చెన్నైలో మ్యాచ్ ఆడతాయి.
– మే 24న చెన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. 3, 4 వ స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ ఆడతాయి.
– మే 26న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో క్వాలిఫయర్ -2 జరుగుతుంది. ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ -1లో ఓడిన జట్టు ఈ మ్యాచ్ లో తలపడతాయి.
– మే 28న క్వాలిఫయర్ – 1, 2 లలో విజేతగా నిలిచిన జట్లు అహ్మదాబాద్ లోనే ఫైనల్స్ ఆడతాయి. ఈ మ్యాచ్ తర్వాత లీగ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది.