Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజన్ 24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66: 50 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధి మాన్ సాహా (47: 37 బంతుల్లో, ఆరు ఫోర్లు) రాణించాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టువృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్జోష్ లిటిల్, జయంత్ యాదవ్, శివం మావి, సాయి కిషోర్, కేఎస్ భరత్
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టుకేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్జయదేవ్ ఉనద్కత్, కృష్ణప్ప గౌతం, డేనియల్ శామ్స్, ప్రేరక్ మన్కడ్, కరణ్ శర్మ