• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home సినిమా

సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి – ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?

BhanuGopal Ch by BhanuGopal Ch
April 22, 2023
in సినిమా
0 0
0
సల్మాన్-మార్కెట్-పదేళ్ళు-వెనక్కి-–-ఫస్ట్-డే-మరీ-ఇంత-ఘోరమా!?

రంజాన్ పండక్కి సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమా వస్తే సూపర్ డూపర్ హిట్!  ఇది చరిత్ర చెప్పిన మాట! కొన్నేళ్ళుగా ఈద్ బాక్సాఫీస్ బరిలో దిగిన ప్రతిసారీ సల్మాన్ ఖాన్ సూపర్ సక్సెస్ నమోదు చేశారు. రివ్యూలతో సంబంధం లేకుండా, సగటు ప్రేక్షకులు చేసే కామెంట్స్ పక్కన పెట్టి మరీ భాయ్ అభిమానులు ఆయన సినిమా చూడటానికి థియేటర్లకు వచ్చేవారు. అదీ సల్మాన్ క్రేజ్ అంటే! అయితే, ఈసారి ఆ క్రేజ్ కూడా రివ్యూస్, ఆడియన్స్ కామెంట్స్ ముందు చిన్నబోయింది.

మొదటి ఆట నుంచి ఫ్లాప్ టాక్!?రంజాన్ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆట నుంచి సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఎక్కడో కొంత మంది తప్ప… మెజారిటీ ప్రేక్షకులు ఈ సినిమా బాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. నిజం చెప్పాలంటే… విడుదలకు ముందు కూడా సినిమాపై సరైన బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన రీతిలో జరగలేదు. ఆ ప్రభావం ఫస్ట్ డే కలెక్షన్స్ మీద పడింది.

ఓపెనింగ్ డే కలెక్షన్స్… జస్ట్ 15 కోట్లే!kisi ka bhai kisi ki jaan first day collection : ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? జస్ట్ 15 కోట్లు మాత్రమే! లాస్ట్ టెన్ ఇయర్స్ చూస్తే… సల్మాన్ ఖాన్ కెరీర్ లోయెస్ట్ ఓపెనింగ్ ఇది! రంజాన్ సందర్భంగా విడుదలైన ఆయన లాస్ట్ పది సినిమాలు చూసినా సరే… ఇదే లీస్ట్ అని చెప్పాలి.

Also Read : పాపం పూజా హెగ్డే – ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్

#KisiKaBhaiKisiKiJaan is underwhelming on Day 1… More so when one compares it with #SalmanKhan’s #Eid releases from 2010 to 2019… Metros weak, mass pockets better, but not great… Extremely important for biz to jump multi-fold today [#Eid]… Fri ₹ 15.81 cr. #India biz. #KBKJ pic.twitter.com/tqvpJbmRrR

— taran adarsh (@taran_adarsh) April 22, 2023

‘దబాంగ్’ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఆ సినిమా రూ. 14.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా రూ. 15.81 కోట్లు కలెక్ట్ చేసింది. లెక్కల పరంగా చూస్తే ‘దబాంగ్’ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటి టికెట్ రేట్లు, ఇప్పటి రేట్లు చూస్తే చాలా తక్కువ అని చెప్పాలి.

సల్మాన్ ఖాన్ మార్కెట్ పడిందా?సినిమాలో కంటెంట్ కొరవడిందా?పది పన్నెండు ఏళ్లుగా రంజాన్ సందర్భంగా విడుదలైన ప్రతి సల్మాన్ ఖాన్ సినిమా బాక్సాఫీస్ బరిలో మొదటి రోజు మినిమమ్ 20 కోట్లు కలెక్ట్ చేసింది. అంత కంటే తక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్స్ సల్మాన్ ఖాన్ రికార్డుల్లో లేదు. అటువంటిది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’కు 15 కోట్లు రావడం అంటే ఏమిటి? సల్మాన్ ఖాన్ మార్కెట్ కాస్త కిందకు పడిందా? లేదంటే సినిమాలో కంటెంట్ కొరవడిందా? అని ప్రశ్నిస్తే… కంటెంట్ లేదని చెప్పాలి. 

Also Read : జైశ్రీరాం, నీపై నమ్మకమే మా బలం – ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘ఆదిపురుష్’ సర్‌ప్రైజ్

#Xclusiv… SALMAN KHAN & EID: *DAY 1* BIZ…2010: #Dabangg ₹ 14.50 cr2011: #Bodyguard ₹ 21.60 cr2012: #EkThaTiger ₹ 32.93 cr2014: #Kick ₹ 26.40 cr2015: #BajrangiBhaijaan ₹ 27.25 cr2016: #Sultan ₹ 36.54 cr2017: #Tubelight ₹ 21.15 cr2018: #Race3 ₹ 29.17 cr2019:… pic.twitter.com/LKeT1He9G3

— taran adarsh (@taran_adarsh) April 22, 2023

తమిళంలో అజిత్ సుమారు పదేళ్ళ క్రితం చేసిన ‘వీరం’ను ఇప్పుడు సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. కథలో కొన్ని మార్పులు చేశారు గానీ టేకింగ్ గట్రా పదేళ్ళ క్రితం సినిమా కంటే దారుణంగా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనకడుగు వేసింది. 

Tags: Kisi Ka Bhai Kisi Ki Jaan Box Office CollectionKisi Ka Bhai Kisi Ki Jaan Collections Day 1salman khanSalman Khan EID Releases Collectionsసినిమా

Recent Posts

  • ఎట్టకేలకు విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ మూవీ సిద్ధం – ట్రైలర్ డేట్ ఫిక్స్
  • మొన్న
  • క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు
  • Samudrik Shastra about Teeth : మీ దంతాల ఆకృతి మీ భవిష్యత్ చెప్పేస్తుంది!
  • పొమన్నలేక పొగబెడుతున్నారో లేదో చంద్రబాబు అడగండి- అధినాయకత్వంపై కేశినేని నాని అసహనం

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In