– ఇస్రో పీఎస్ఎల్వీ సీ55 విజయవంతం- సింగపూర్ కు చెందిన రెండు శాటిలైట్లు- విజయంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో- పీఎస్ఎల్వీతో పాటు 7 నాన్ సపరేటింగ్ పేలోడ్స్ – హైదరాబాద్ ధృవ స్పేస్ నుంచి రెండు పేలోడ్స్
శ్రీహరి కోట సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి జరిగిన పీఎస్ఎల్ వీ సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మధ్యాహ్నం 2.20 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కి చెందిన రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలో విజయంవతంగా ప్రవేశపెట్టింది ఇస్రో. 741కిలోల బరువుగల టెలియోస్ 2, 16కిలోల బరువుగల లూమోలైట్-4 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ మోసుకెళ్లింది.
Team #DhruvaSpace is in full spirits ahead of the #PSLVC55 launch, wearing the new Mission T-shirts!▶️ We’ll be watching the livestream via #ISRO’s YouTube Channel at https://t.co/5m2CK2gDaS pic.twitter.com/IWcyuW9IUH
— Dhruva Space (@DhruvaSpace) April 22, 2023
హైదరాబాద్ కు చెందిన ధృవ స్పేస్ పేలోడ్స్..సింగపూర్ వాతావరణ పరిస్థితులు, ఈ నావిగేషన్, సముద్ర భద్రత, షిప్పింగ్ కమ్యూనిటీ ప్రయోజనాల కోసం ఈ శాటిలైట్లు ఉపయోగకరం కానున్నాయి. అయితే ఈరెండు మెయిన్ పేలోడ్స్ తో పాటు పీఎస్ఎల్వీ సీ 55 ద్వారా ఏడు నాన్ సపరేటింగ్ పేలోడ్స్ ను కూడా ప్రయోగించింది ఇస్రో. ఇస్రోతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ లు బెంగుళూరు కు చెందిన Bellatrix, హైదరాబాద్ కు చెందిన ధృవ స్పేస్ (Dhruva Space)కు సంబంధించిన పేలోడ్స్ ను కూడా పంపించారు.
లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ధృవ స్పేస్ పేలోడ్స్పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్ పెరిమెంటల్ మాడ్యూల్ POEM గా పిలుచుకునే దీంట్లో ధృవస్పేస్ కు చెందిన రెండు పేలోడ్స్ ను పంపించారు. ధృవ (Dhruva) శాటిలైట్ ఆర్బిటల్ డిప్లాయర్ DSOD రెండు వేరియంట్స్ తో పాటు శాటిలైట్ బేస్డ్ డేటా రిలే ఆపరేషన్స్ కోసం ఓ రేడియో ఫ్రీకెన్వీ మాడ్యూల్ (DSOD-3U, DSOL, and DSOD-6U) ను కూడా పంపించారు. గతేడాది జూన్ లో థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 పేరుతో రెండు కమ్యూనికేషన్ శాటిలైట్లను పీఎస్ఎల్వీ ద్వారా లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి పంపించిన ధృవ స్పేస్ ఇప్పుడు రెండు పేలోడ్స్ ను పంపించి రికార్డు సృష్టించింది.
Looking forward to seeing how our DSOD-3U, DSOL, and DSOD-6U fare in this mission. For more info on our spacecrafts, visit: https://t.co/u821IPclND pic.twitter.com/guQcXSDjg8
— Dhruva Space (@DhruvaSpace) April 22, 2023
కక్ష్యలోకి సింగపూర్ ఉపగ్రహాలు
ఉపగ్రహం టెలీయోస్-2 సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలను తీర్చడానికి, అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇది పనిచేస్తుంది. మరో ఉపగ్రహం LUMELITE-4 .. 16 కిలోల బరువున్న అధునాతన ఉపగ్రహం, అధిక ఫ్రీక్వెన్సీ డేటా మార్పిడి వ్యవస్థను ఇందులో ఉంది. సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంచడానికి, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడానికి ఈ ఉపగ్రహాన్ని తయారుచేశారు. TeLEOS-2ని డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (DSTA), రక్షణ, సైన్స్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సింగపూర్ టెక్నాలజీస్ ఇంజినీరింగ్, సింగపూర్ ఏరోస్పేస్ మధ్య భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశారు. ఈ రెండు ఉపగ్రహాలను తూర్పు దిశగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీకి ఇది 57వ ప్రయోగం. ఈ వాహక నౌక పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM)ని కూడా మోసుకెళ్లింది. POEM-2 ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST), బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ధ్రువ స్పేస్ సంస్థలు అభివృద్ధి చేసిన ఏడు పేలోడ్లు ప్రయోగించారు. నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రయోగించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.