YS Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చిన సీబీఐ.. హైదరాబాద్ లోని ఆఫీస్ కు విచారణకు రావాలని కోరింది. దీంతో శనివారం ఆయన విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యాస్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్‌రెడ్డిని సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. ఆ లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పారని ప్రశ్నించినట్లు సమాచారం. శనివారం సాయంత్రం 4 గంటలకు సీబీఐ ఆఫీస్ కు వచ్చిన రాజశేఖర్‌రెడ్డి.. విచారణ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడంలేదని ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నిస్తున్న తరుణంలో… రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడం ప్రాధాన్యత సంచరించుకుంది. వివేకా హత్య కేసులో ఇటీవల అరెస్టైన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ విచారిస్తుంది.