• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home శుభసమయం

ఏప్రిల్ 22 రాశిఫలాలు, ఈ రాశులవారిని కోపం డామినేట్ చేసేస్తుంది

BhanuGopal Ch by BhanuGopal Ch
April 22, 2023
in శుభసమయం
0 0
0
ఏప్రిల్-22-రాశిఫలాలు,-ఈ-రాశులవారిని-కోపం-డామినేట్-చేసేస్తుంది

Contents

  • 1 ఏప్రిల్ 22 శనివారం రాశిఫలాలు
  • 2 మేష రాశి
  • 3 వృషభ రాశి
  • 4 మిథున రాశి
  • 5 కర్కాటక రాశి
  • 6 సింహ రాశి
  • 7 కన్యా రాశి
  • 8 తులా రాశి 
  • 9 వృశ్చిక రాశి 
  • 10 ధనుస్సు రాశి 
  • 11 మకర రాశి
  • 12 కుంభ రాశి
  • 13 మీన రాశి 

ఏప్రిల్ 22 శనివారం రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారికి రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది.  స్నేహితులు, బంధువుల రాక వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది.  ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. రిలాక్స్ అయ్యే మూడ్ లో ఉంటారు. మీకున్న కొన్ని బలహీనతలను మార్చుకోవడం మంచిది.

వృషభ రాశి

ఈ రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కోపం మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబం, ఆర్థిక విషయాలలో ఆందోళన ఉంటుంది. ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీరు కష్టపడినా ఫలితం లభించదు. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఖర్చులు తగ్గించుకోవాలి. వేరేవారి మాటల మధ్యలోకి మీరు వెళ్లొద్దు. 

మిథున రాశి

ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ పని తీరుకి ప్రశంసలు అందుకుంటారు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. స్నేహితుల కారణంగా లాభపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంటి మరమ్మతు పనులు ప్రారంభిస్తారు. దంపతుల మధ్య సంతోషం పెరుగుతుంది.

Also Read: అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా కొనాల్సిన 10 వస్తువులు

కర్కాటక రాశి

ఈ రోజు సమయం మరియు డబ్బు రెండూ అధికంగా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనిని పూర్తి చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబంలో శాంతి, ఆనంద వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందగలుగుతారు. మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఈ రోజున మీరు మీ పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు.

సింహ రాశి

ఈ రోజు మీకు ఏ పని చేయాలనే భావన ఉండదు. వివాదాల వల్ల సన్నిహితులపై కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారం లేదా ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది. ఆశించిన ఫలితాలు రావు. మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. ప్రభుత్వ పనులకు ఆటంకాలు కలుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో సందేహం నెలకొంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది

కన్యా రాశి

ఈరోజు కొత్త బాధ్యతలు తీసుకోవద్దు. మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుంది. బయటి ఆహారం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మౌనంగా ఉండటమే సరైనది. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. రహస్య శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు.

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

తులా రాశి 

ఈ రోజంతా సరదాగా ఉంటాకు. మీకు గౌరవం లభిస్తుంది కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో పురోగమించే రోజు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. అందమైన దుస్తులు లేదా ఆభరణాల కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు.

వృశ్చిక రాశి 

ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ శరీరాన్ని మరియు మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. చేయాలనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది….మీ లక్ష్యాన్ని సులభంగా పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు, శత్రువుల కుయుక్తులు ఫలించవు. బంధువర్గం నుంచి ప్రయోజనం ఉంటుంది. ఆకస్మికంగా ఏదో ఒక పనిలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈరోజు పెట్టుబడి విషయంలో ఒత్తిడికి గురికాకండి. మీరు మీ కెరీర్‌కు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి 

ఈ రోజు మీరు సంయమనం పాటించాలి. ఉదర సంబంధమైన జబ్బుల వల్ల సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఏ పనిలోనైనా విజయం సాధించలేకపోవడం నిరాశకు దారితీస్తుంది. సాహిత్యం లేదా మరేదైనా సృజనాత్మక పని మీద ఆసక్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయండి. ఉద్యోగులు ఈరోజు తమ పనిని మాత్రమే పట్టించుకోవాలి. పనికిరాని వాదనలలో సమయాన్ని వృథా చేయకండి.

మకర రాశి

ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉండదు. కుటుంబంలో కలహాల వాతావరణం ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. మీ విషయంలో ప్రతికూలత పెరుగుతుంది. రోజంతా ఆందోళనగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ హామీలు ఇవ్వకండి. 

కుంభ రాశి

ఈ రోజు ఆర్థికపరమైన ఆందోళనలు తగ్గుతాయి. మానసికంగా సంతోషాన్ని అనుభవిస్తారు. శారీరకంగా బాగుంటుంది. వాతావరణం ఆనందంగా ఉంటుంది. లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.

మీన రాశి 

ఈ రోజు మీ మాటల విషయంలో సంయమనం పాటించండి. వివాదాలకు అవకాశం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక  లావాదేవీలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మీ పనుల పట్ల అలసత్వం వహించకండి.

Tags: 20th APril Horoscope22nd April AstrologyAaj Ka Rashifalastrological prediction todayastrologyHoroscope for 22nd AprilHoroscope Todayrasi phalaluToday Rasiphalaluశుభసమయం

Recent Posts

  • అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? – మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
  • ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!
  • యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
  • వార్నర్ ఔట్ – పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే
  • ధరణి వద్దన్నోడిని గిరాగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరెయ్యండి – కేసీఆర్ వ్యాఖ్యలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In