ప్రభు శ్రీరామ్ పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించారు. జానకి దేవి అలియాస్ సీతగా కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్ విడుదల చేసింది.
విల్లు చేతబట్టిన శ్రీరాముడురామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ (Adipurush Movie) రూపొందుతోన్న విషయం విదితమే. శ్రీరాముని పాత్రలో ప్రభాస్ లుక్ ఆల్రెడీ విడుదల చేశారు. ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే… విల్లు చేతబట్టిన శ్రీరాముని రూపాన్ని చూపించారు.
ఐదు భాషల్లో జైశ్రీరాం పాట‘ఆదిపురుష్’ సినిమా కోసం సంగీత దర్శక ద్వయం అజయ్ – అతుల్ స్వరపరిచిన ‘జైశ్రీరాం’ సాంగ్ మోషన్ పోస్టర్ సైతం ఈ రోజు ఆవిష్కరించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ… మొత్తం ఐదు భాషల్లో పాటను విడుదల చేశారు. ఒక్క నిమిషం పాట మాత్రమే ఇప్పుడు విడుదలైంది. త్వరలో పూర్తి పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
”నీ సాయం…సదా మేమున్నాం!సిద్ధం…సర్వ సైన్యం!సహచరులై…పదా వస్తున్నాం!సఫలం…స్వామి కార్యం!
మా బలం ఏదంటే…నీపై నమ్మకమే!తలపున నువ్వుంటే…సకలం మంగళమే!మహిమాన్విత మంత్రం నీ నామంజైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం!”అంటూ సాగిన ఈ గీతాన్ని సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి రాశారు. సుమారు 20 మంది ఈ పాటకు కోరస్ అందించారు.
Also Read : ‘మిరపకాయ్’ తర్వాత మళ్ళీ రవితేజ – మరి శర్వానంద్?
ట్రిబెకా చిత్రోత్సవాల్లో ‘ఆదిపురుష్’ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది పలు చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రతిష్టాత్మకంగా భావించేవి కొన్ని ఉంటాయి. అందులో ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival 2023) ఒకటి. అందులో ప్రదర్శనకు ‘ఆదిపురుష్’ సినిమా ఎంపిక అయ్యింది. దర్శకుడు ఓం రౌత్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
ఈ ఏడాది జూన్ 7 నుంచి 18వ తేదీ వరకు ట్రిబెకా చలన చిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అందులో జూన్ 13వ తేదీన ‘ఆదిపురుష్’ ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు. దాంతో సినిమా షోలు మొదలు అవుతాయని చెప్పవచ్చు.
త్రీడీలో జూన్ 16న ‘ఆదిపురుష్’ విడుదలజూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీరాముడి అంటే హిందువులలో ఉన్న భక్తి, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ సినిమాను విడుదల చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా ‘ఆదిపురుష్’ టీమ్ ప్లాన్ చేసిందట. ఇండియా మొత్తం మీద ఎనిమిది వేల థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రోజుకు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని టాక్.
Also Read : ‘కన్నై నంబాతే’ మూవీ రివ్యూ: రెప్పపాటులో ఇన్ని ట్విస్టులా?