• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home శుభసమయం

2023 Mercury Retrograde: మేషరాశిలో బుధుడు తిరోగమనం, 4 రాశులవారికి ఊహించనంత మంచి జరుగుతుంది!

BhanuGopal Ch by BhanuGopal Ch
April 22, 2023
in శుభసమయం
0 0
0
2023-mercury-retrograde:-మేషరాశిలో-బుధుడు-తిరోగమనం,-4-రాశులవారికి-ఊహించనంత-మంచి-జరుగుతుంది!

2023 Mercury Retrograde:  జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే అది తిరోగమనంలో ఉన్నప్పుడు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం మేషరాశిలో బుధుడు తిరోగమనంలో ఉండటం..అంటే మొదటి ఇంట్లో తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగంలో వృద్ధి, కుటుంబంలో సంతోషం లభిస్తాయి. ఈ తిరోగమన స్థితిలో మే 15 వరకు ఉంటారు. బుధుడిని తెలివితేటలు, తర్కం కారక గ్రహంగా భావిస్తారు. ఇది విద్య, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను సూచిస్తుంది. ముఖ్యంగా నాలుగు రాశులవారకి అత్యంత అనుకూల ఫలితాలనిస్తాడు వక్రంలో ఉన్న బుధుడు. 

Contents

  • 1 మేష రాశి
  • 2 మిథున రాశి
  • 3 సింహ రాశి 
  • 4 కుంభ రాశి

మేష రాశి

ఈ రాశి వారి మొదటి ఇంట్లో అంటే వివాహంలో తిరోగమనం చెందాడు బుధుడు. ఈ ప్రభావంతో మీరు మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను సులభంగా తీసుకోగలుగుతారు. ఈ నిర్ణయాల వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు పని రంగంలో పురోగతిని పొందుతారు. మీరు మీ కెరీర్ పట్ల చాలా సంతృప్తి చెందుతారు. బుధుడి తిరోగమనం కారణంగా మేష రాశి వారి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం, ఉద్యోగులకు ఉన్నత హోదా లభిస్తుంది. కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. బుధుడు తిరోగమనంలో ఉన్న సమయంలో వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అయితే ఖర్చులు మాత్రం నియంత్రించాలి. 

Also Read: అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు – ఎందుకంటే!

మిథున రాశి

బుధుడి తిరోగమనం మీ రాశి నుంచి  పదకొండో స్థానంలో ఉంది. ఇది మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, విదేశీ ప్రయాణాలకు సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు ఆర్థికంగా లాభపడతారు.  బుధుడి తిరోగమన కదలిక పనిప్రాంతంలో మీ కృషిని మెరుగుపరుస్తుంది, బలాన్ని పెంచుతుంది. సీనియర్ అధికారుల నుంచి  ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి ఊహించని లాభాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు.  వ్యాపారంలో నూతన ప్రణాళికలను అమలు చేస్తారు. మొత్తంమీద..ఆర్థికంగా బాగాలాభపడతారు.

సింహ రాశి 

ఈ రాశివారికి బుధుడి తిరోగమనం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు అదృష్టం మద్దతిస్తుంది. మంచి లాభాలు ఆర్జించడంలో విజయం సాధిస్తారు. మీరు మీ సామర్థ్యాలను గుర్తిస్తారు. సింహ రాశి వారికి వృత్తిలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ అవాంతరాలు లేకుండా పూర్తవుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పనిప్రాంతంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

కుంభ రాశి

మేష రాశిలో బుధుడి తిరోగమనం కుంభరాశివారికి కలిసొస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు పని రంగంలో అధిక పురోగతిని సాధిస్తారు. పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం అనుకూలంగా, ఫలప్రదంగా ఉంటుంది. కుంభ రాశి వారు ఈ కాలంలో డబ్బు సంపాదించడంతో పాటు డబ్బును ఆదా చేయగలుగుతారు. పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభం పొందుతారు. మీరు ప్రేమ జీవితంలో ప్రేమ మరియు సామరస్యాన్ని కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతారు…

Tags: 2023 budh vakri mesh rashi2023 Mercury Retrogrademercury retrograde 2023mercury retrograde in ariesMesh Rashitransit budh vakri gocharzodiac signsశుభసమయం

Recent Posts

  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?
  • ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
  • AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
  • నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
  • ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది – మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In