• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

లోకల్ టు గ్లోబల్‌ వరకు ఇవాళ జరిగే ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్‌ ఇక్కడ చూసేయండి

sastra_admin by sastra_admin
April 21, 2023
in న్యూస్
0 0
0
లోకల్-టు-గ్లోబల్‌-వరకు-ఇవాళ-జరిగే-ఇంట్రస్టింగ్-అప్‌డేట్స్‌-ఇక్కడ-చూసేయండి

Headlines Today : నేడు సుప్రీంలో సునీత పిటిషన్‌పై విచారణ

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ వాదనలు వినబోతోంది. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. శుక్రవారం విచారణకు స్వీకరిస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు.

నేడు మరోసారి అవినాష్ రెడ్డి విచారణ 

వరుసగా మూడో రోజు కూడా అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. కోర్టు అనుమతితో ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మరో సహ నిందితుడు ఉదయ్ కుమార్‌ను ప్రశ్నించనుంది. శుక్రవారం సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నించింది. మొదటి రోజు ఎనిమది గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు రెండో రోజు ఆ సమయాన్ని మరో గంట పెంచారు. 9 గంటల పాటు ప్రశ్నించారు. మరో వైపు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా చంచల్ గూడ జైలు నుంచి సీబీఐ ఆఫీసుకు తీసుకు వచ్చారు. వారిని ఇతర గదుల్లో విచారణ జరిపారు. కలిపి విచారణ జరపలేదని తెలుస్తోంది. ప్రశ్నించడానికి కోర్టు ఐదు రోజుల సమయం ఇవ్వడం.. ముందస్తు బెయిల్ పై తుది తీర్పు వచ్చే వరకూ రోజూ సీబీఐ ఆఫీసుకు  హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రతి చిన్న విషయాన్ని సీబీఐ అధికారులు క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఐపీఎల్‌ 2023లో చెన్నైతో హైదరాబాద్‌ ఢీ 

ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు నేడు (ఏప్రిల్ 21) తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్పిన్నర్లకు ఈ మైదానం ఎప్పుడూ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తమ మునుపటి ప్లేయింగ్-11ను మార్చి అదనపు స్పిన్నర్లను ఆడించాలని భావిస్తున్నాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ జింక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తేజస్ నెట్‌వర్క్స్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్

మార్కెట్‌ విలువ ప్రాతిపదికన దేశంలోనే అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇవాళ నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ స్టాక్‌ ఇండెక్స్ హెవీ వెయిట్‌ కాబట్టి  షేర్లు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి. మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ టాప్‌లైన్ & బాటమ్‌లైన్ వృద్ధి నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది.

HCL టెక్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో HCL టెక్ రూ. 3,983 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 3,593 కోట్లతో పోలిస్తే ఇది 11% పెరుగుదల. డీల్స్‌ పైప్‌లైన్‌ బలంగా ఉంది, దీర్ఘకాలిక వృద్ధిని ప్రతిబింబిస్తోంది. ICICI ప్రుడెన్షియల్‌ లైఫ్: 2023 జనవరి-మార్చి కాలానికి ICICI ప్రు లైఫ్ ఏకీకృత నికర లాభం 26% పెరిగి రూ. 235 కోట్లకు చేరుకుంది. ఇది గతేడాది ఇదే కాలంలో రూ. 186 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

సైయెంట్: మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ. 163 కోట్లు, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 154 కోట్లతో పోలిస్తే 6% అధికం.

నెస్లే ఇండియా: ఈ కంపెనీ ప్రకటించిన రూ. 27 డివిడెండ్‌కు సంబంధించి, నెస్లే ఇండియా షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌తో ట్రేడ్ అవుతాయి. ప్రకటించిన డివిడెండ్‌ మేర షేర్‌ ధర తగ్గుతుంది.

లక్ష్మి ఆర్గానిక్: ఈక్విటీ సేల్‌ లేదా రుణాలు లేదా ఈ రెండు మార్గాలను కలిపి రూ. 2,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనను కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.

ఫినోలెక్స్ కేబుల్స్: ఆప్టికల్ ఫైబర్ ప్రిఫార్మ్‌లను (Optical Fibre Preforms) ఉత్పత్తి చేయడానికి, ఫైబర్ కేబుల్స్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పుణెలోని ఉర్సే ఫెసిలిటీలో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది.

వొడాఫోన్ ఐడియా: కుమార మంగళం బిర్లాను అదనపు డైరెక్టర్‌గా ఈ కంపెనీ నియమించింది, ఈ నియామకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది.

స్టెర్లింగ్ & విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ: మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 417 కోట్ల నికర నష్టాన్ని నివేదించగా, కార్యకలాపాల ద్వారా రూ. 88 కోట్ల ఆదాయం వచ్చింది.

ఓరియంటల్ హోటల్స్: FY23 నాలుగో త్రైమాసికంలో 69% వృద్ధితో రూ. 115.56 కోట్ల ఆదాయాన్ని ఓరియంటల్ హోటల్స్ ఆర్జించింది. నికర లాభం రూపంలో రూ. 17.79 కోట్లు మిగుల్చుకుంది.

Tags: Andhra Pradesh newsHeadlines TodayHigh CourtIPL 2023National NewsSupreme CourtTelangana NewsViveka Murder Caseన్యూస్

Recent Posts

  • నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
  • ఆశలన్నీ ఆదివారం పైనే – ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
  • ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ – లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!
  • విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
  • జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In