Stock Market Closing 21 April 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఇంట్రాడేలో కుంగిన సూచీలు సాయంత్రం ఓపెనింగ్ లెవల్స్‌కు రికవరీ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 1 పాయింట్ పెరిగి 17,624 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 22 పాయింట్లు పెరిగి 59,655 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 82.09 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,632 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,538 వద్ద మొదలైంది. 59,412 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,781 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 22 పాయింట్ల లాభంతో 59,655 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,624 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,639 వద్ద ఓపెనైంది. 17,553 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,663 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1 పాయింట్ పెరిగి 17,624 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 42,252 వద్ద మొదలైంది. 41,962 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,382 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 151 పాయింట్లు పెరిగి 42,118 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, టీసీఎస్, బ్రిటానియా, విప్రో, సిప్లా షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ లైఫ్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.61,150గా ఉంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 పెరిగి రూ.28,890 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘PapeeDabba దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations Pattech Fitwell Tube Components Limited on getting listed on NSE Emerge today! #NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #pattech #fitwell #tube #components @ashishchauhan pic.twitter.com/15kYGMnJtX
— NSE India (@NSEIndia) April 21, 2023 #Throwback to an important milestone in NSE’s journey. On this day in 2008, we launched the Securities Lending & Borrowing platforms (SLBS) which enabled automated lending, borrowing, early recall and repayment of orders.#NSE #NSEIndia #Milestone #SLBS @ashishchauhan pic.twitter.com/PjjDx8c4FV
— NSE India (@NSEIndia) April 21, 2023