• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home పర్సనల్ ఫైనాన్స్

అక్షయ తృతీయ రోజు బంగారం కొనబోతున్నారా? ఈసారి సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెట్టి చూడండి

sastra_admin by sastra_admin
April 21, 2023
in పర్సనల్ ఫైనాన్స్
0 0
0
అక్షయ-తృతీయ-రోజు-బంగారం-కొనబోతున్నారా?-ఈసారి-సావరిన్-గోల్డ్-బాండ్‌లో-పెట్టుబడి-పెట్టి-చూడండి

Sovereign Gold Bonds: అక్షయ తృతీయ రోజు కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా కొంటే శుభం జరుగుతుందన్నది ఒక నమ్మకం. ఒకవేళ, మీరు ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని భావిస్తే, భౌతిక నగల రూపంలోనే కాకుండా, సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తాజాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెల 14న వీటిని జారీ చేసింది. దీంతో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో SGBని (Sovereign Gold Bond) కొనుగోలు చేసే సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. 

సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి?భౌతిక రూపంలో ఉండే బంగారపు వస్తువులను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రజలు కాస్త సంకోచిస్తారు. దొంగల భయంతో నిద్ర పట్టదు. ఈ అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే గోల్డ్‌ సావరిన్‌ బాండ్‌. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిని జారీ చేస్తుంది. బంగారంలో మదుపు చేయాలనుకనే వాళ్లు ఈ రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, గోల్డ్‌ బాండ్లను ఆర్‌బీఐ వద్ద భద్రంగా ఉంచుకోవచ్చు. 

ఒక్కో గోల్డ్‌ బాండ్‌ కాల పరిమితి ఎనిమిది సంవత్సరాలు. అయితే గోల్డ్ బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, ఈ బాండ్లను ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనాలి?సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలను పొందవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక సంరక్షకుడు లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం?SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(కూపన్‌ రేట్‌) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. 

ఎంత బంగారం కొనవచ్చు?గోల్డ్‌ బాండ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.

గత మార్చిలో SGB విడుదలకు, ఇప్పటికి బంగారం ధరలు భారీగా పెరిగాయి. అప్పుడు ఒక్కో బాండ్‌ను రూ.5,611 కి (ఒక గ్రాముకు సమానం) RBI విడుదల చేసింది. 2015లో సావరిన్ గోల్డ్ బాండ్‌ పథకాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. 2016లో SGB రేటు కనిష్ట స్థాయిలో ఉంది, అప్పటి బాండ్‌ ధర 2,600.

అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా బంగారు బాండ్లలో పెట్టుబడి పెట్టడం కొంచెం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు 23 శాతం (US డాలర్ ప్రకారం) పెరిగాయి.

Tags: akshaya tritiya 2023SGB Scheme 2022-23Sovereign Gold BondSovereign Gold Bond subscriptionపర్సనల్ ఫైనాన్స్

Recent Posts

  • ఎట్టకేలకు విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ మూవీ సిద్ధం – ట్రైలర్ డేట్ ఫిక్స్
  • మొన్న
  • క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు
  • Samudrik Shastra about Teeth : మీ దంతాల ఆకృతి మీ భవిష్యత్ చెప్పేస్తుంది!
  • పొమన్నలేక పొగబెడుతున్నారో లేదో చంద్రబాబు అడగండి- అధినాయకత్వంపై కేశినేని నాని అసహనం

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In