• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home Reliance

Reliance: నాలుగో త్రైమాసికంలో సత్తా చాటిన జియో.. నికర లాభం, ARPU పెరుగుదల ఎలా ఉందంటే..

sastra_admin by sastra_admin
April 21, 2023
in Reliance
0 0
0
reliance:-నాలుగో-త్రైమాసికంలో-సత్తా-చాటిన-జియో-నికర-లాభం,-arpu-పెరుగుదల-ఎలా-ఉందంటే.

For Quick Alerts

Subscribe Now  

For Quick Alerts

ALLOW NOTIFICATIONS  

| Published: Saturday, April 22, 2023, 8:16 [IST]

Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫలితాలు వెలువడ్డాయి. మార్చితో ముగిసిన త్రైమాసికానికి గాను నికర లాభం YoY 13 శాతం పెరిగినట్లు కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయానికి 4 వేల 173 కోట్లు ఆర్జించగా.. ఈసారి 4 వేల 716 కోట్లు సాధించినట్లు వెల్లడించింది. డిసెంబర్ త్రైమాసికంలోని 4 వేల 638 కోట్ల లాభంతో పోలిస్తే మార్చి నాటికి 1.7 శాతం ఆదాయం పెరిగినట్లు పేర్కొంది.

గతేడాది ఇదే త్రైమాసికంలో 20 వేల 901 కోట్లతో పోలిస్తే ఈ క్వార్టర్ లో 23 వేల 394 కోట్ల ఆదాయం వచ్చింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు సైతం 11.9 శాతం మరియు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1.7 శాతం పెరిగాయి. 5 త్రైమాసికాల్లో లాభం సహా రాబడిలో వృద్ధి మందగించింది. అధిక ఖర్చులతో పాటు ఇటీవల పన్నుల పెంపు లేకపోవడం దీనికి కారణంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ త్రైమాసికంలో EBITDA 12 వేల 210 కోట్లుగా ఉండగా.. మార్జిన్ 52.19 శాతంగా నమోదైంది.

విశ్లేషకుల అంచనాలనుకు అనుగుణంగానే జియో ఫలితాలు సాధించింది. కంపెనీ ఆదాయం 12 శాతం వృద్ధితో 23 వేల 430 కోట్లుగా ఉంటుందని నోమురా అంచనా వేసింది. Emkay గ్లోబల్ సైతం సంస్థ ఆదాయం 1.7 శాతం పెరిగి 23 వేల 394 కోట్లు ఆర్జిస్తుందని ముందే చెప్పింది. అయితే నోమురా అంచనా 4 వేల 690 కోట్లతో పోలిస్తే లాభాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయి. జియో ప్లాట్‌ ఫారమ్‌లు EBITDAలో 17 శాతం వృద్ధిని కనబరిచాయి.

మార్చి 2023 నాటికి మొత్తం సబ్‌ స్క్రైబర్ బేస్ 43.93 కోట్లకు పెరగి మంచి మెరుగుదల కొనసాగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూస్తే 1.5 శాతం వృద్ధి సాధించింది. ఒక్కో వినియోగదారుడిపై టెలికాం సంస్థ సగటు ఆదాయం(ARPU) QoQకి స్వల్పంగా రూ.178.8కి పెరిగింది. “పరిశ్రమలోని నికర సబ్‌ స్క్రైబర్‌ల జోడింపు FY23కి 29.2 మిలియన్లు కాగా నెలవారీ 2 శాతం వద్ద స్థిరంగా ఉంది. టారిఫ్ పెంపు, మెరుగైన సబ్‌స్క్రైబర్ మిక్స్ మరియు ఎంపిక చేసిన కస్టమర్ డేటా యాడ్-ఆన్‌ల ప్రభావం వల్ల ARPUలోనూ 6.7 శాతం YoY వృద్ధి కనిపించింది” అని జియో తన ఆదాయ ప్రకటనలో తెలిపింది.

భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు.. తన ప్రధాన ఆదాయ విభాగం జియో దన్నుగా నిలిచింది. తద్వారా నాల్గవ త్రైమాసికానికి గాను 19 శాతానికి పైగా రాబడి పెరిగినట్లు శుక్రవారం నివేదించింది. దీంతో గ్రూపు మొత్తం లాభం మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 16 వేల 203 కోట్ల నుంచి 19 వేల 299 కోట్లకు పెరిగింది. ఆయిల్-టు-కెమికల్స్ (O2C) వ్యాపారంలోనూ EBITDA 14 శాతానికి పైగా ఎగబాకి 16 వేల 293 కోట్లకు చేరుకుంది. అయితే ముడి చమురుపై విండ్ ఫాల్ పన్ను వల్ల ఈ విభాగం ఆదాయం 12 శాతం పడిపోయింది.

English summary

Reliance Jio Q4 net profit rises 13 percent while ARPU increased a bit low.

Reliance Jio results released..

Story first published: Saturday, April 22, 2023, 8:16 [IST]

Tags:   DNAearnings" data-eng-tags="relianceearnings"> Read more about: reliance jio financial results profits earningsfinancial resultsJioprofitsRead more about: reliance jio financial results profits earnings

Recent Posts

  • ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు – పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని
  • TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు!
  • ప్చ్‌.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్‌! అజింక్య సెంచరీ మిస్‌ – ఆసీస్‌కు భారీ లీడ్‌!
  • ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం – కేసీఆర్
  • పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది – విడుదల ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In