For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Friday, April 21, 2023, 15:30 [IST]
Reliance: కొన్ని నెలలుగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ అనేక కొత్త వ్యాపారాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని వేగంతో కొత్త వ్యాపారాలను కొనుగోలు చేస్తోంది. అయితే ఇప్పుడు అంబానీ తీసుకున్న నిర్ణయం టాటాలకు పెద్ద పోటీగా నిలవనుంది.
బిలియనీర్ అంబానీ దేశంలో టాటాలు నిర్వహిస్తున్న స్టార్‌బక్స్‌తో పోటీ పడటానికి సిద్ధమౌతోంది. అవును వివరాల్లోకి వెళితే బ్రిటీష్ శాండ్విచ్ & కాఫీ చైన్ ‘ప్రెట్ ఎ మాంగర్’ తాజాగా భారత మార్కెట్లోకి అడుగు పెట్టింది. టీ ఎక్కువగా తాగే దేశంలో కాఫీ వ్యాపారానికి చెందిన మొదటి స్టోర్‌ను శుక్రవారం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్ మ్యాక్సిటీలో ప్రారంభించింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యం కోసం గత ఏడాది బ్రిటిష్ యజమానితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తొలి ఏడాది దేశంలో పది ‘ప్రెట్ ఎ మ్యాంగర్’ స్టోర్లను ప్రారంభించనున్నారు.
తాజా ముడిపదార్థాలు, ప్రత్యేక రుచులను అందించాలని నిర్ణయించినట్లు రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. ఈ బ్రాండ్ భారతదేశంలోని విమానాశ్రయాలపై దృష్టి పెడుతుందని గత ఏడాది చెప్పారు. ఒప్పందం ప్రకారం రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 100 ప్రీట్ ఎ మాంగర్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే పోటీదారుగా ఉన్న టాటా స్టార్‌బక్స్ 30 నగరాల్లో 275 స్టోర్లను కలిగి ఉంది. 50 శాతం వాటాతో అమెరికన్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ ను దేశంలో టాటాలు నడుపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టాటాలు కొత్తగా రికార్డు స్థాయిలో 50 స్టోర్లను ప్రారంభించారు.
రిలయన్స్ తాజా నిర్ణయం దీర్ఘకాలంలో టాటాలకు పెద్ద పోటీని ఇవ్వనుంది. దేశీయ కాఫీ మార్కెట్ మీద కన్నేసిన కెనడియన్ కాఫీ అండ్ బేక్డ్ గూడ్స్ చైన్ టిమ్ హోర్టన్స్ ఆగస్టు 2022లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో రెండు స్టోర్లను ప్రారంభించింది. ఇది రానున్న మూడేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 120 స్టోర్లను రూ.240 కోట్ల పెట్టుబడితో ప్రారంభించాలని యోచిస్తోంది. 2025 నాటికి కాఫీ మార్కెట్ 4.2 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నందున చాలా సంస్థలు ప్రస్తుతం భారత మార్కెట్లపై దృష్టి సారించాయని తెలుస్తోంది.
English summary
Mukesh ambani’s reliance started coffee store Pret A Manger in mumbai to beat tata’s starbucks
Mukesh ambani’s reliance started coffee store Pret A Manger in mumbai to beat tata’s starbucks
Story first published: Friday, April 21, 2023, 15:30 [IST]