For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
Contents
రికరింగ్ డిపాజిట్లపై సూపర్ వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్.. మీరెక్కడ దాచుకుంటున్నారు..?
| Published: Friday, April 21, 2023, 22:18 [IST]
Recurring Deposits: స్వల్పకాలిక అవసరాల కోసం పెట్టుబడులు పెట్టేందుకు మనలో చాలా మంది రికరింగ్ డిపాజిట్లను ఎంచుకుంటుంటారు. ఇందులో ఏడాది నుంచి 10 ఏళ్ల కాలానికి డబ్బు దాచుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. రెగ్యుల్ ఇన్కమ్ ఉండేవారు వీటిలో మంచి వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు.
రిజర్వు బ్యాంక్ వరుసగా ఆరుసార్లు వడ్డీ రేట్లను పెంచటంతో అనేక పెట్టుబడి సాధనాల వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ క్రమంలో 5 ఏళ్ల కాలానికి చేసే ఆర్డీలపై మంచి రేటు ఆఫర్ చేస్తున్న ఫైనాన్స్ సంస్థల జాబితాలో డీసీబీ బ్యాంక్ ముందు స్థానంలో నిలిచింది. రికరింగ్ డిపాజిట్లపై బ్యాంక్ 7.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇన్వెస్టర్లు ఐదేళ్లపాటు ప్రతి నెల రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే చివర్లో రూ.3.66 లక్షలు పొందుతారు.
ఇక సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదేళ్ల కాలవ్యవధికి 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ్ ఉత్తమ రేటుతో ఐదేళ్ల పాటు నెలకు రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.3.65 లక్షలు పొందవచ్చు. ఇక ప్రైవేటు బ్యాంకర్ ఇండస్‌ఇండ్ ఐదేళ్ల కాల వ్యవధి కోసం RDలపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇందులో ఐదేళ్ల పాటు నెలకు రూ.5 వేలు పొదుపు చేసేవారికి రూ.3.62 లక్షలు లభిస్తాయి.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదేళ్ల కాలవ్యవధి RDలపై 7.20 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఎవరైనా ఇన్వెస్టర్ నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే.. వారు డిపాజిట్ ముగిసే సమయంలో రూ.3.62 లక్షలు అందుకుంటారు.
చివరగా ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలైన.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఐదేళ్ల కాలానికి ఆర్‌డిలపై 7 శాతం వడ్డీని అందిస్తున్నాయి. IDFC ఫస్ట్ బ్యాంక్, RBL బ్యాంక్, యెస్ బ్యాంక్‌లతో సహా ఇతర చిన్న ప్రైవేట్ బ్యాంకులు కూడా ఐదేళ్ల కాలానికి 7 శాతం వడ్డీని అందిస్తామని హామీ ఇస్తున్నాయి. అంటే వీటిలో నెలకు రూ.5,000 చొప్పున ప్రతినెల డిపాజిట్ చేస్తే ఐదేళ్ల కాలం పూర్తయ్యాక రూ.3.60 లక్షలు ఇన్వెస్టర్లు పొందుతారు.
English summary
Know best banks offering high interest rates on Recurring Deposits and their return too
Know best banks offering high interest rates on Recurring Deposits and their return too
Story first published: Friday, April 21, 2023, 22:18 [IST]