• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home రాజమండ్రి

ఏపీ ప్రభుత్వంపై పోరాటానికి బీజేపీ వ్యూహాలు, కోర్ కమిటీ మీటింగ్ లో కీలక నిర్ణయాలివే

BhanuGopal Ch by BhanuGopal Ch
April 21, 2023
in రాజమండ్రి
0 0
0
ఏపీ-ప్రభుత్వంపై-పోరాటానికి-బీజేపీ-వ్యూహాలు,-కోర్-కమిటీ-మీటింగ్-లో-కీలక-నిర్ణయాలివే

AP BJP Core Committee Meeting: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకూ పది రోజులు పాటు పోరాటం చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయాలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఛార్జ్ షీట్ లు దాఖలు చేస్తాం అన్నారు. బీజేపీ అంటే వైసీపీకి అనుకూలం అన్న వాతావరణాన్ని అధిగమిస్తాం అని చెప్పారు. ఏపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మే నెలలో 10 రోజులపాటు నిరసన, ఆందోళనతో పోరాట కార్యక్రమాలు చేపడతామన్నారు. 

కుటుంబ పార్టీలకి బీజేపీ వ్యతిరేకం అన్నారు. మే 15 నుంచి జూన్ 15 వరకు ప్రధాని మోదీ పాలన రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ ప్రచార భేరి నిర్వహిస్తుందన్నారు మాధవ్. తాము జనసేన తోనే ఉన్నామని, జనసేనతోనే కలిసి వెళ్తాం అన్నారు. జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక చేస్తున్నాo అన్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుందని ఆరోపించారు. వ్యవస్థలు నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ జగన్ అరాచకాలపై కోర్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.

క్షేత్ర స్థాయిలో వాగ్దానాలు.. ప్రభుత్వ తప్పిదాలు, భూ కబ్జాలపై కోర్ కమిటీలో చర్చించారు. ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పిన సీఎం జగన్  ప్రజల్ని మోసం చేసిన దానిపై రాష్ట్ర జిల్లా స్థాయిలో చార్జ్ షీట్స్ బయటకు తియ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో భూ దందా… కబ్జాలు, ఇసుక మాఫియా సమస్యతో పాటు మద్యాన్ని నిషేధించాలని వీటిన్నిటిపై ఏపీ బీజేపీ నేతలు ఉద్యమం చేయ్యాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం మోగించనున్నాం. మే 5 నుండి 16 వ తేదీ వరకు రాష్ట్ర జిల్లా స్థాయిలో చార్జిసీట్ తీసుకువచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు.

జనసేన నేతలకు కూడా ఈ కార్యక్రమాలు వివరించి కలిసికట్టుగా వేళతామన్నారు. వైసీపీతో బీజేపీ కలిసికట్టుగా వెళ్తుందని… అసత్య ప్రచారం జరుగుతుంది దాని తిప్పి కొడదాం అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాధవ్. గతంలో తెలుగు దేశం కూడా రాష్ట్రంలో అరాచకాలు చేసిందని… కుటుంబ పాలన పార్టీలకి బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు, పితాని ఏదో ఊహించి మాట్లాడుతున్నారు.. కేంద్ర పెద్దలలో కూడా జనసేనాని పవన్ భేటీ అయ్యారు. జనసేన, బీజేపీ పరస్పరం గౌరవించుకుంటూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందుకు వెళతాం అన్నారు. 

బీజేపీతోనే పవన్..పవన్ మాతోనే ఉన్నారు.. ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాo అని బీజేపీ నేత మాధవ్ స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తులు ఉంటాయన్నది బీజేపీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందన్నారు. రోడ్ మ్యాప్ బీజేపీయే ఇవ్వనవసరం లేదు.. పవన్ అయినా ఇవ్వచ్చు అని పేర్కొన్నారు. జనసేనతో కలిసి కార్యక్రమాల రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అంతా అభివృద్ది జరగాలని కోరుకుంటుందని, అయితే వైసీపీ చెప్పినట్లుగా 3 రాజధానులు ఉండవని, ఏపీకి రాజధాని అమరావతే అని తమ పార్టీ ఎప్పుడో చెప్పిందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, టీడీపీతో వెళ్లాలని అనుకుంటే తమ పార్టీ అడ్డుపడుతుందన్న టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు మాధవ్.

 

Tags: AP Latest newsAP PoliticsBJPJanasenaMadhavరాజమండ్రి

Recent Posts

  • కేరళను తాకిన రుతుపవనాలు- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి వానలు 
  • రిలాక్స్ అయింది చాలు – పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
  • పార్లమెంట్‌లోనే బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ, చప్పట్లతో మారుమోగిన ప్రాంగణం
  • బ్రహ్మీ చాలా రిచ్ గురూ, ఈ ఇండియన్ కమెడియన్స్‌ ఆస్తుల్లో టాప్ బ్రహ్మానందమే!
  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In