• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఐపీఎల్

చెపాక్‌లో టాస్‌ ధోనీదే! తొలుత బ్యాటింగ్‌ ఎవరిదంటే?

sastra_admin by sastra_admin
April 21, 2023
in ఐపీఎల్
0 0
0
చెపాక్‌లో-టాస్‌-ధోనీదే!-తొలుత-బ్యాటింగ్‌-ఎవరిదంటే?

CSK vs SRH, IPL 2023: 

చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఎంఎస్ ధోనీ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆకాశం మేఘావృతం కావడంతో గెలుపు అవకాశాలు 50-50 ఉంటాయని అన్నాడు. ఒకవేళ మంచు కురిస్తే ఛేదన సులభం అవుతుందని చెప్పాడు. సేమ్‌ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు.

‘మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. మబ్బులు ఉన్నాయి కాబట్టి 50-50 ఛాన్సెస్‌ ఉంటాయి. డ్యూ లేట్‌గా రావొచ్చు. పాయింట్ల పట్టిక గురించి ఆలోచించడం లేదు. మెరుగ్గా ఆడటంపైనే దృష్టి పెడతాం. కాంబినేషన్‌ పరంగా మేం అదృష్టవంతులమే. ఆటగాళ్లు అందరూ అందుబాటులోకి వస్తే తలనొప్పి తప్పదు. జట్టులో మార్పులేమీ లేవు. ఇంపాక్ట్‌ ప్లేయర్లు కూడా సేమ్‌’ అని సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అన్నాడు.

‘మేం కూడా బౌలింగే చేయాలనుకున్నాం. కేకేఆర్‌పై తొలుత బ్యాటింగ్‌ బాగానే చేశాం. ఇక్కడా అదే ప్రదర్శన చేస్తామని అనుకుంటున్నాం. మేమంతా కలిసి ఆడాలి. ఒక డిపార్ట్‌మెంట్‌లో బాగున్నాం. మిగతా విభాగాల్లో రాణించాలి. దానిపైనే పనిచేస్తున్నాం. జట్టులో ఏ ఒక్కరు బంతిని బాదేసినా మూమెంటమ్‌ మారుతుంది. షెడ్యూలు కాస్త బిజీగానే ఉంది. అయినా మేం ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఐపీఎల్‌ ఉపయోగపడుతుంది. ముంబయి మ్యాచులో ఆడిన జట్టునే బరిలోకి దించుతున్నాం’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌ అన్నాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే, అజింక్య రహానె, శివమ్‌ దూబె, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మహీశ్‌ థీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్‌, మతీశ పతిరణ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: హ్యారీ బ్రూక్‌, మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్‌ మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అభిషేక్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో ఎన్‌సన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ మర్కండే, ఉమ్రాన్‌ మాలిక్‌

ఘనమైన రికార్డు.. 

సన్ రైజర్స్ పై ధోనికి మంచి రికార్డు ఉంది.  ఐపీఎల్‌లో ఎస్ఆర్‌‌హెచ్‌పై  18  ఇన్నింగ్స్ ఆడితే అందులో ఏకంగా 488 పరుగులు చేశాడు.  18 ఇన్నింగ్స్ లో 488  పరుగులు చేయడం గొప్పా..? అని విమర్శించేవారూ లేకపోలేదు. కానీ ధోని  బ్యాటింగ్ కు వచ్చేది ఆరో స్థానంలో.  ధోని క్రీజులోకి వచ్చేసరికే దాదాపు  15, 16 ఓవర్లు ముగుస్తాయి. ఆడే బంతులు కూడా తక్కువగా ఉంటాయి.  ఆ సమయంలో  వచ్చి  488 పరుగులు సాధించడమనేది మాటలు కాదు.  సన్ రైజర్స్ పై ధోని సగటు  కూడా  48.80 గా ఉండటం గమనార్హం.  

ఎస్ఆర్‌‌హెచ్‌పై   ధోని 18 ఇన్నింగ్స్ లలో  488 పరుగులు చేయగా ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 8 సార్లు  నాటౌట్ గా ఉండి తన టీమ్ ను గెలిపించుకున్నాడు. 30 ప్లస్ స్కోర్లు కూడా ఆరు సార్లు చేశాడు.  ఈ క్రమంలో   ధోని స్ట్రైక్ రేట్  సైతం  145.24 గా ఉంది. అత్యధిక స్కోరు 37 బంతుల్లో 67 నాటౌట్ గా ఉంది. మరి నేటి మ్యాచ్‌లో ‘తాలా’ను అడ్డుకోకుంటే  సన్ రైజర్స్ బౌలర్లకు మరోసారి బడిత పూజ తప్పదు. 

Chennai is ready to whistle 💛🥁#TATAIPL | #CSKvSRH pic.twitter.com/ICm6jVTmQj

— IndianPremierLeague (@IPL) April 21, 2023

Tags: Aiden Markramchennai superkingsCSK vs SRHIPL 2023MS DhoniSunRisers Hyderabadఐపీఎల్

Recent Posts

  • అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? – మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
  • ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!
  • యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
  • వార్నర్ ఔట్ – పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే
  • ధరణి వద్దన్నోడిని గిరాగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరెయ్యండి – కేసీఆర్ వ్యాఖ్యలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In