For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Friday, April 21, 2023, 16:07 [IST]
Market Closing: ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదొడుకుల్లో ట్రేడ్ అయ్యాయి. అయితే ఆరంభ లాభాలు కేవలం కొన్ని గంటల్లోనే ఆవిరయ్యాయి. ఈ క్రమంలో సూచీలు చివరికి ఫ్లాట్ గా వారాంతంలో తమ ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 0.4 పాయింట్ల నష్టంలో క్లోజ్ అయ్యింది. ఇక చివరగా బ్యాంక్ నిఫ్టీ సూచీ 151 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 132 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని ముగించాయి. అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం ఉందని తేలటంతో ఆ ప్రభావం మన మార్కెట్లలోనూ నేడు కనిపించింది. ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణం పోరాటం ముగియలేదని వెల్లడించింది.
NSE సూచీలో ఐటీసీ, టీసీఎస్, బ్రిటానియా, విప్రో, సిప్లా, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, దివి ల్యాబ్స్, హీరో మోటార్స్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో నిలిచి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, మారుతీ, హిందాల్కొ, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని వారాతంలో ముగించాయి.
English summary
Indian markets ended falt and negative amid volatality, know details of fall
Indian markets ended falt and negative amid volatality, know details of fall
Story first published: Friday, April 21, 2023, 16:07 [IST]