• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఎంటర్‌టైన్‌మెంట్‌

ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది?

sastra_admin by sastra_admin
April 21, 2023
in ఎంటర్‌టైన్‌మెంట్‌
0 0
0
ఈవిల్-డెడ్-రైజ్-రివ్యూ:-‘ఈవిల్-డెడ్’-ఫ్రాంచైజీలో-కొత్త-సినిమా-ఎలా-ఉంది?

ఈవిల్ డెడ్ రైజ్

Horror, Thriller

దర్శకుడు: లీ క్రోనిన్

Artist: అలీస్సా సదర్లాండ్, లిలీ సులివాన్, మోర్గాన్ డేవిస్, గాబ్రియల్ ఎకోల్స్, నెల్ ఫిషర్ తదితరులు

సినిమా రివ్యూ : ఈవిల్ డెడ్ రైజ్ (Evil Dead Rise)రేటింగ్ : 2.75/5నటీనటులు : అలీస్సా సదర్లాండ్, లిలీ సులివాన్, మోర్గాన్ డేవిస్, గాబ్రియల్ ఎకోల్స్, నెల్ ఫిషర్ తదితరులుసినిమాటోగ్రఫీ : డేవ్ గార్బెట్సంగీతం : స్టీఫెన్ మెకియోన్నిర్మాత : రాబ్ టపెర్ట్రచన, దర్శకత్వం : లీ క్రోనిన్విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022

Evil Dead Rise Movie Review: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హార్రర్ సినిమాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సిరీస్ ఇదే. 2013లో వచ్చిన ‘ఈవిల్ డెడ్’ తర్వాత ఈ సిరీస్ నుంచి మరో సినిమా రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అదే ‘ఈవిల్ డెడ్ రైజ్’. మరి ఈ కొత్త ఈవిల్ డెడ్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది?

కథ: ఎల్లీ (అలీస్సా సదర్లాండ్) ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ముగ్గురు పిల్లలను పెంచడానికి కష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు ఎల్లీ చెల్లెలు బెత్ (లిలీ సులివాన్) వారిని చూడటానికి అపార్ట్‌మెంట్‌కు వస్తుంది. అదే రోజు రాత్రి బెత్ పెద్ద కొడుకు డానీ (మోర్గాన్ డేవిస్) ఆ ఇంటి బేస్‌మెంట్‌లో ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పుస్తకం, కొన్ని గ్రామోఫోన్ రికార్డులను తీసుకువస్తాడు. తన చెల్లి బ్రిడ్జెట్ (గాబ్రియల్ ఎకోల్స్)ఎంత చెప్పినా వినకుండా ఆ బుక్ ఓపెన్ చేసి, గ్రామోఫోన్ రికార్డులను ప్లే చేస్తాడు. దీంతో ఒక్కసారిగా వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి. వారి తల్లి ఎల్లీనే వారిని చంపడానికి వస్తుంది? ఇలా ఎందుకు జరిగింది? ఆ పుస్తకంలో ఏం ఉంది? ఆ రాత్రి దాటేసరికి ఎంతమంది ప్రాణాలతో మిగిలారు? ఈ విషయాలు తెలియాలంటే ‘ఈవిల్ డెడ్ రైజ్’ థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే!

విశ్లేషణ: వరల్డ్ సినిమాలో హార్రర్ కేటగిరీకి వస్తే ‘ఈవిల్ డెడ్’ టాప్ సిరీస్‌ల్లో ఒకటిగా ఉంటుంది. 80, 90వ దశకాల్లో ప్రపంచం మొత్తాన్ని ‘ఈవిల్ డెడ్’ సినిమాలు ఒక ఊపు ఊపాయి. 90వ దశకంలో పుట్టిన వారిలో (90s Kids) చాలా మంది చూసిన మొదటి హాలీవుడ్ హార్రర్ సినిమా ‘ఈవిల్ డెడ్’నే అయి ఉంటుంది. అంత సక్సెస్‌ను ఈ సిరీస్ సాధించింది. మరి లేటెస్ట్ సినిమాలోని కంటెంట్, హార్రర్, థ్రిల్స్ ఆ స్థాయిలో ఉన్నాయా?

సినిమా స్క్రీన్ ప్లే ఆద్యంతం చాలా రేసీగా సాగుతుంది. ఎక్కడా ఒక్క అనవసరమైన సీన్ కాదు కదా, షాట్ కూడా కనిపించదు. అంత గ్రిప్పింగ్‌గా ఈ స్క్రీన్‌ప్లేను రాసుకున్నారు. సినిమా నిడివి కేవలం 97 నిమిషాలే కాబట్టి ఫస్టాఫ్, సెకండాఫ్ లాంటి మాటలు వాడటం ఇక్కడ అనవసరం. మొదటి 20 నిమిషాల పాటు పాత్రల పరిచయం జరుగుతుంది. ఒక్కసారి హార్రర్ టర్న్ తీసుకున్నాక స్క్రీన్‌ప్లే పరుగులు పెడుతుంది. తల్లి చనిపోయి దయ్యంగా మారి పిల్లలను చంపడానికి ప్రయత్నించినప్పుడు పిన్ని వారి బాధ్యతలను తీసుకోవడం, నేనే తల్లిగా మిమ్మల్ని చూసుకుంటా అని వారికి మాటివ్వడం వంటి అంశాలు ఎమోషనల్‌గా బాగా పండాయి.

అయితే హార్రర్ విషయంలో మాత్రం ఈవిల్ డెడ్ రైజ్ కాస్త వెనుక పడిందనే చెప్పాలి. హార్రర్ సినిమాకు ప్రేక్షకుడు ఊహించని విధంగా వచ్చే భయపెట్టే సన్నివేశాలు (జంప్ స్కేర్ సీన్లు) చాలా ముఖ్యం. కానీ ‘ఈవిల్ డెడ్ రైజ్’ సినిమా మొత్తమ్మీద ఇలాంటి సీన్లు వేళ్ల మీద లెక్కబెట్టే స్థాయిలో కూడా లేవు. కేవలం ఒకటో, రెండో ఉన్నాయి అంతే. పాత ‘ఈవిల్ డెడ్’ సినిమాలు చూసిన వారికి ఇందులో పోయే కొద్దీ ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. స్క్రీన్‌ప్లే కాస్త ఊహకు అందకుండా రాసుకుని ఉండాల్సింది. అప్పుడే కదా ఆడియన్స్‌కు హార్రర్‌లో అసలైన కిక్కు దొరికేది.

మరి పాత ‘ఈవిల్ డెడ్’ సిరీస్ సినిమాల కంటే ఏ విషయంలో ‘ఈవిల్ డెడ్ రైజ్’ పై చేయి సాధించింది? ‘రక్తపాతం జరగాల్సిందే!’ ‘రక్తం ఏరులై పారాల్సిందే’ ఒకప్పటి తెలుగు సినిమాల్లో చాలా ఎక్కువగా వినిపించే పంచ్ డైలాగ్ ఇది. డైరెక్టర్ లీ క్రోనిన్ దీన్ని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నాడు. స్క్రీన్ మీద ట్యాంకులకు ట్యాంకులు రక్తం పారుతూనే ఉంటుంది. మీరు ఇప్పటి దాకా చూసిన అన్ని సినిమాల్లో కనిపించిన రక్తాన్ని కలిపినా ఇందులో దాని కంటే కచ్చితంగా రెట్టింపు రక్తం ఉంటుంది. క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక సన్నివేశంలో అయితే రక్తం స్క్రీన్ మీద నుంచి ఆడియన్స్ సీటు కిందకు, కాళ్ల కిందకు వచ్చేసిందా అన్నట్లు ఉంటుంది. వయొలెన్స్, బ్లడ్ షెడ్‌ను చూపించడంలో హాలీవుడ్ దర్శకుడు క్వెంటన్ టరంటినో ముందు వరుసలో ఉంటాడు. కానీ ఆయన సినిమాల్లో కూడా ఇంత బ్లడ్ కనిపించదు. స్క్రీన్ మీద జరిగే సీన్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉన్నా సరే అందులో కనిపించే ఈ అనవసరపు రక్తపాతం ‘అరే ఏంట్రా ఇది’ అనిపిస్తుంది. రక్తం ఎక్కువగా కనిపించే సీన్లు ఉంటే అవే హార్రర్ సీన్లేమో అని దర్శకుడు అనుకుని ఉంటాడు. కానీ ఎంత వయొలెంట్ సినిమాలు అలవాటు పడిన వాళ్లకైనా ఈ సినిమాలోని రక్తపాతం చూస్తే కాస్త చిరాకు, అసహనం కచ్చితంగా కలుగుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

స్టీఫెన్ మెకియోన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సౌండ్ డిజైన్ కూడా సీన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. డేవ్ గార్బెట్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేసింది. సినిమా మొత్తం దాదాపు ఒకే ఇంట్లోనే తీసినప్పటికీ బోరింగ్‌గా అనిపించలేదంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్‌దే.

ఇక నటీనటుల విషయానికి వస్తే… పిల్లలను కాపాడుకోవాలనుకునే తల్లిగా, అదే పిల్లలను చంపే దెయ్యంగా అలీస్సా సదర్లాండ్ వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించింది. ముఖ్యంగా దెయ్యం పాత్రలో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ భయపెట్టే విధంగా ఉన్నాయి. అక్క పిల్లలను కాపాడటానికి అవసరం అయితే దెయ్యానికి కూడా ఎదురెళ్లే పాత్రలో లిలీ సులివాన్ అదరగొట్టింది. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే… ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీ ఫ్యాన్స్, హార్రర్, వయొలెంట్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. ఒకవేళ మీరు సున్నిత మనస్కులైతే మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండండి.

Tags: ABPDesamReviewEvil Dead RiseEvil Dead Rise Movie ReviewEvil Dead Rise RatingEvil Dead Rise ReviewEvil Dead Rise Review in Teluguఎంటర్‌టైన్‌మెంట్‌

Recent Posts

  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?
  • ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
  • AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
  • నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
  • ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది – మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In