• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home క్రికెట్

నా ఫస్ట్ రన్ తీసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలే – ఢిల్లీ బోణీపై దాదా కామెంట్స్

sastra_admin by sastra_admin
April 21, 2023
in క్రికెట్
0 0
0
నా-ఫస్ట్-రన్-తీసినప్పుడు-కూడా-ఇంత-ఆనందం-రాలే-–-ఢిల్లీ-బోణీపై-దాదా-కామెంట్స్

DC vs KKR: ‘తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా..’ అంటాడు తెలుగులో వెంకటేశ్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాలో.. ఇంచుమించుగా ఐపీఎల్‌-16లో ఢిల్లీ క్యాపిటల్స్  ఫీలింగ్ కూడా ఇలాగే ఉంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ‘అసలు ఢిల్లీ ఈ సీజన్‌లో బోణీ కొడుతుందా..?’ అన్న అనుమానాలను  పటాపంచలు చేస్తూ  ఎట్టకేలకు ఢిల్లీ  ఓ విజయాన్ని అందుకుంది. గురువారం  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా   కోల్‌కతా నైట్ రైడర్స్ తో ముగిసిన మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆనందాలు వెల్లివిరాశాయి.  

మ్యాచ్ ముగిశాక ఢిల్లీ టీమ్‌కు  డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ  కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇయాన్ బిషప్ తో దాదా మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు బోణీ కొట్టినందుకు సంతోషంగా ఉంది.  నేను డగౌట్ లో కూర్చుని  మ్యాచ్ గెలిచిన తర్వాత  నాకు నా కెరీర్ లో ఫస్ట్ రన్ తీసినట్టు (నవ్వుతూ) అనిపించింది.  ఇవాళ మేము అదృష్టవంతులం. విన్నింగ్ టీమ్ గా ఉన్నాం..’అని  అన్నాడు.  దాదా  1996లో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన  టెస్టులో  అరంగేట్రం చేసిన విషయం  తెలిసిందే.  

మా బ్యాటర్లు మారాలి.. 

మ్యాచ్ గెలిచినా  ఢిల్లీ బ్యాటింగ్  చెత్తగా ఉంది. డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడి ఉండకపోయి ఉంటే నిన్న 128 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించడం ఆ జట్టుకు భారంగా ఉండేది.   వర్షం తర్వాత స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ పై  సాధించాల్సిన  128 పరుగుల లక్ష్యాన్ని కూడా  ఛేదించేందుకు ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు.  ఇదే విషయమై దాదా  స్పందిస్తూ.. ‘మేం బాగానే బౌలింగ్ చేస్తున్నాం. కానీ మా బ్యాటింగ్ దారుణంగా ఉంది.  ఈ విషయంలో మేం  మా లోపాలను సమీక్షించుకోవాల్సి ఉంది.   మా టీమ్ లో పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే కీలక ప్లేయర్లు. కానీ వాళ్లు ఇంకా ఫామ్ ను అందుకోలేదు. అదే ఆందోళనకరంగా ఉంది..’అని దాదా వ్యాఖ్యానించాడు. 

 

This moment, this moment is what we call HAPPINESS 🥹💙pic.twitter.com/6AeGnyDxsx

— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2023

కాగా  గురువారం నాటి మ్యాచ్‌లో  కేకేఆర్‌ను  127కే నిలువరించిన  ఢిల్లీ.. తర్వాత లక్ష్య ఛేదనలో తడబడింది. ఒక దశలో  ఏడు ఓవర్లలో  61-1 గా ఉండి లక్ష్యం వైపు దూసుకెళ్లిన ఆ జట్టు  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.  పృథ్వీ షా (13) తో పాటు మిచెల్ మార్ష్ (2), ఫిలిప్ సాల్ట్ (5),  అమన్ ఖాన్ (0), మనీష్ పాండే (21) లు విఫలమయ్యారు.  డేవిడ్ వార్నర్ (57) నిష్క్రమించిన తర్వాత గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న  అక్షర్ పటేల్ (19 నాటౌట్)  కేకేఆర్ స్పిన్ త్రయం నితీశ్ రాణా,  వరుణ్ చక్రవర్తి,  అనుకుల్ రాయ్ లు కట్టడి చేసినా చివరి ఓవర్లో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. 

Tags: David WarnerDC vs KKRDelhi CapitalsIndian Premier LeagueIPL 2023Sourav Gangulyక్రికెట్

Recent Posts

  • ఒడిశాలో ప్రమాదానికి గురైన మార్గంలో సర్వీస్‌లు పునఃప్రారంభం- రైల్వే మంత్రి భావోద్వేగం
  • వేసవిలో తాటి ముంజలను తప్పనిసరిగా ఎందుకు తినాలి?
  • రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం
  • తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్
  • డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In