• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home తెలంగాణ

కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

sastra_admin by sastra_admin
April 21, 2023
in తెలంగాణ
0 0
0
కరీంనగర్-–-హసన్-పర్తి-రైల్వే-లైన్‌కు-కేంద్రం-గ్రీన్-సిగ్నల్

ఉత్తర తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది కేంద్రం. దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. అందులో భాగంగా కొత్త రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరం నిధులు కేటాయింపుతోపాటు, రైల్వే లేన్ నిర్మాణ పనులను ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైల్వే శాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్ ను కలిసి కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. దీంతోపాటు సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ప్రాంతంలో స్టేషన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణకు ఈ అభివృద్ధి జరగాలన్నారు ఎంపీ బండి సంజయ్.  

కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లేన్ విషయానికొస్తే…

2013లో ఈ రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోని కారణంగా రైల్వే లైన్  అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.  దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్ – హసన్ పర్తి ఈ రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీ తోపాటు వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణా మరింత సులువు అవుతుంది.  

రైల్వేశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలో వచ్చే నెలలో ప్రారంభించేందుకు తమ వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ అశ్వినీ వైష్ణవ్ ఇచ్చారు. అట్లాగే సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో రైలు ఆగేలా ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లేన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని బండి సంజయ్‌ తెలిపారు. నిర్లక్ష్యం వల్లే ఈ రైల్వే లేన్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని, దీనివల్ల ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి గత యేడాది ఫిబ్రవరి 11న ఇదే విషయంపై కేంద్రమంత్రిని కలిశారు బండి సంజయ్.  హసన్‌పర్తి కరీంనగర్ రైల్వే లైన్ వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత BUDGETలోనే నిధులు కూడా కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. హసన్‌పర్తి- కరీంనగర్ రైల్వేలైన్ అంశాన్ని చాలా సార్లు రైల్వేశాఖ దృష్టి తీసుకొచ్చామని.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు వినతి పత్రం అందజేసినట్టు బండి సంజయ్‌ వివరించారు. ఈ కొత్త రైల్వే లైన్ సాధ్యాసాధ్యాలపై గతంలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సర్వే చేసి 2013లోనే బోర్డుకు నివేదిక పంపారని అప్పట్లోనే తెలిపారు.

Tags: Ashwini VaishnawHasanparthy-KarimnagarKomura VelliKomuravelli MallannaManoharabad-Kothapalliతెలంగాణ

Recent Posts

  • నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
  • ఆశలన్నీ ఆదివారం పైనే – ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
  • ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ – లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!
  • విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
  • జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In