• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home జాబ్స్

TSPSC: ఏఈఈ అభ్యర్థులకు అలర్ట్, ఆన్‌లైన్‌లో ఏఈఈ(సివిల్) ప‌రీక్ష నిర్వహణ!

sastra_admin by sastra_admin
April 21, 2023
in జాబ్స్
0 0
0
tspsc:-ఏఈఈ-అభ్యర్థులకు-అలర్ట్,-ఆన్‌లైన్‌లో-ఏఈఈ(సివిల్)-ప‌రీక్ష-నిర్వహణ!

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మే 21న ఏఈఈ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధతిలో ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని గ‌తంలో టీఎస్‌పీఎస్సీ ప్రక‌టించిన సంగతి తెలిసిందే. అయితే ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చర్, మెకానిక‌ల్ పోస్టుల‌తో పాటు సివిల్ పోస్టుల‌కు కూడా ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 21న అధికారికంగా ప్రకటించింది.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఎలక్ట్రికల్‌ & ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌; మే 9న అగ్రికల్చర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్ అభ్యర్థుల‌కు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించ‌నున్నారు. ఇక మే 21, 22 తేదీల్లో రెండు షిప్టుల్లో ఏఈఈ(సివిల్) పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. తుది స్కోరు ఖ‌రారులో నార్మలైజేష‌న్ ప‌ద్ధతిని పాటించాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. 

ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్‌ లీకేజీ కారణంగా కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టుల భర్తీకి ఏఈఈ నోటిఫికేషన్‌ను 2022 సెప్టెంబర్‌ 3న టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం విదితమే. ఈ పోస్టుల‌కు 44,352 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. 

రాతపరీక్ష విధానం:

మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.

ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిష‌న్ భ‌గీర‌థ‌, ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, అర్అండ్‌బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా భ‌ర్తీ చేయనున్నారు.

ఏఈఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబర్​ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. వాస్తవానికి అక్టోబరు 15 దరఖాస్తుకు చివరితేది కాగా.. గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో మరో 5 రోజులు అవకాశం కల్పిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

పోస్టుల వివరాలు.. 

* అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1540

1)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్  (మిషన్ భగీరథ): 302 పోస్టులు     

2)   ఏఈఈ(సివిల్)- పీఆర్‌ఆర్‌డీ ‌డిపార్ట్‌మెంట్: 211 పోస్టులు    

3)  ఏఈఈ (సివిల్) ఎంఏ యూడీ- పీహెచ్: 147 పోస్టులు    

4)  ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్: 15 పోస్టులు

5)  ఏఈఈ ఐ‌సీఏడీ డిపార్ట్ మెంట్: 704 పోస్టులు    

 6)  ఏఈఈ (మెకానికల్) ఐసీఏడీ(జీడబ్ల్యూడీ): 03 పోస్టులు    

 7)  ఏఈఈ (సివిల్) టీఆర్‌బీ: 145 పోస్టులు    

 8)  ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్‌బీ: 13 పోస్టులు    

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.    

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022. (20.10.2022 వరకు పొడిగించారు)   

➥ పరీక్ష తేదీ: 22.01.2023. (08.05.2023 నుంచి)

పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…

Tags: AEE Recruitment ExamsTSPSC AEE Exam DateTSPSC AEE Online ExamTSPSC AEE Recruitment 2022TSPSC Assistant Executive Engineer PostsTSPSC Jobsజాబ్స్

Recent Posts

  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?
  • ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
  • AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
  • నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
  • ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది – మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In