For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Friday, April 21, 2023, 14:27 [IST]
Investment: స్టార్ మార్కెట్లలోకి అందరూ వచ్చేది లాభాలను పొందటానికే. కానీ అది మనం ఊహించుకున్నంత సులువైనది కాదని అనుభవపూర్వకంగా చాలా మంది నష్టపోయిన వారికి తెలుసు. అది గ్యాంబ్లింగ్ అనే వారు ఉన్నప్పటికీ.. నిలవాలంటే ఎల్లప్పుడూ మార్పులకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి.
అయితే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అవసరమైన విలువైన చిట్కాకలను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వెల్లడిస్తుంటారు. తాజాగా పోడ్‌కాస్ట్ సిరీస్ రెండవ ఎపిసోడ్‌లో.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి, సోషల్ మీడియా, బిల్ గేట్స్‌తో తన సమావేశం సహా పలు అంశాలపై మాట్లాడారు.
ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు ముందుగా వారు నాలుగైదు తప్పులను చేస్తుంటారని పేర్కొన్నారు. అలాంటి తప్పులు చేయటం వల్ల డబ్బును కోల్పోయే అవకాశాలు పెరుగుతూ పోతాయని అన్నారు. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు మంచి రిటర్న్స్ పొందగలిగే కొన్ని ‘సరళమైన’ మార్గాల గురించి మాట్లాడారు. కొత్త వారు ముందుగా నిఫ్టీ 50 లేదా ఏవైనా ఐదు లార్జ్ క్యాప్ షేర్లను కొనుగోలు చేయటం చాలా సులువైన ఎంపిక అన్నారు. ఇలా గడచిన 30-40 ఏళ్ల మధ్య పెట్టుబడి పెట్టి వాటిని ముట్టుకోకుండా ఉంటే ఊహించని లాభాలను పొంది ఉండేవారని తెలిపారు.
టాక్స్ విషయానికి సంబంధించి పెద్ద సీక్రెట్ చెబుతూ.. ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినట్లయితే దానిలో వచ్చే లాభాలకు 30-40 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీర్ఘకాలం స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై 10 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లిస్తే సరిపోతుందనే విషయాన్ని ప్రస్తావించారు. అయితే వ్యాపారంలోనైనా, మార్కెట్లలోనైనా ఒడిదొడుకులు తప్పవని కామత్ అన్నారు.
— Nikhil Kamath (@nikhilkamathcio) April 20, 2023 అయితే పెట్టుబడులపై ప్రజలకు అవగాహన కల్పించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడాల్సిన బాధ్యత జెరోధా వంటి మధ్యవర్తులపై ఉందంటూ కామత్ ముగించారు. అయితే ఈ ఎపిసోడ్‌లో వర్సే సహవ్యవస్థాపకులు ఉమంగ్ బేడి, కూ సీఈవో అప్రమేయ రాధాకృష్ణ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన్మయ్ భట్ పాల్గొన్నారు.
English summary
Zerodha co founder Nikhil Kamath revealed tips to make good profits from stock markets
Zerodha co founder Nikhil Kamath revealed tips to make good profits from stock markets
Story first published: Friday, April 21, 2023, 14:27 [IST]