For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Friday, April 21, 2023, 11:23 [IST]
JP Morgan: దేశంలోని ఐటీ కంపెనీలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తమ నాలుగో త్రైమాసిక ఆదాయాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్ల అంచనాలను అందుకోవటంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫెయిల్ కావటంతో మార్కెట్లు ఇటీవల భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే.
దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించటం ఆదాయాలపై భారీగా ప్రభావాన్ని చూపుతోంది. కానీ నిన్న విడుదలైన హెచ్‌సీఎల్ ఫలితాలు మాత్రం మార్కెట్ అంచనాలు అధిగమించి రికార్డు సృష్టించాయి. ఇదే క్రమంలో మాస్టెక్, సైయంట్ స్ట్రీట్‌ను తమ ఫలితాలతో ఆశ్చర్యపరిచాయి. ఏదేమైనప్పటికీ యూఎస్ బ్యాంకింగ్ సంక్షోభం, గ్లోబల్ మందగమనం దేశీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
TCS, Infosys, HCL టెక్ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ట్రెండ్‌ను గమనిస్తే.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI), టెలికాం వర్టికల్స్‌లో బలహీనతను హైలైట్ చేస్తున్నాయని ప్రపంచ పరిశోధన, బ్రోకింగ్ సంస్థ JP మోర్గాన్ వెల్లడిస్తూ హెచ్చరించింది. ఎక్కువ భారతీయ ఐటీ కంపెనీలు ఆదాయాన్ని ఈ రంగాల నుంచి పొందుతున్నందున మార్జిన్లు, ఆదాయాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇది కంపెనీలను ప్రమాదంలో పడేసే అవకాశం ఎక్కువగా ఉందని బ్రోకరేజ్ తెలిపింది.
ఈ పరిస్థితుల్లో FY24/25కి టెక్ మహీంద్రా రాబడి అంచనాలను 3 శాతం/5 శాతం తగ్గించగా.. మార్జిన్ అంచనాలను 40/60 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలాగే Mphasis ఆదాయ అంచనాలను 6 శాతం/8 శాతం, మార్జిన్ 40/30 bps తగ్గాయి. అలాగే ఈ కంపెనీల టార్గెట్ ధరలను వరుసగా రూ.900, రూ.1,550కి రేటింగ్ సంస్థ తగ్గించింది.
English summary
US Rating firm JP Morgan warned IT firms TCS, HCL amid banking crisis, lowerd share target rates
US Rating firm JP Morgan warned IT firms TCS, HCL amid banking crisis, lowerd share target rates
Story first published: Friday, April 21, 2023, 11:23 [IST]