For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Friday, April 21, 2023, 12:16 [IST]
HCL Tech: ఆర్థిక అనిశ్చితులు ఎక్కువగా ఉన్నప్పటికీ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ దుమ్ముదులిపింది. ఈ క్రమంలో క్యూ-4లు మార్కెట్లను ఆశ్చర్యపరిచాయి. ఇదే క్రమంలో టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్.. ఉద్యోగులు వేచిచూస్తున్న వేరియబుల్ పే విషయంపై ప్రకటన చేసింది.
వేరియబుల్ పే అనేది ఉద్యోగి పరిహారంలో ఒక భాగం. ఇది కంపెనీ పనితీరు, వ్యక్తిగత ఉద్యోగుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఐటీ దిగ్గజం రూ.3,593 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా.. తాజా ఫలితాల్లో 10.80 శాతం వృద్ధితో రూ.3,983 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. అదే విధంగా అమ్మకాలను గమనిస్తే గత ఏడాది రూ.22,597 కోట్లు ఉండగా.. తాజా క్యూ4లో మాత్రం 17.70 శాతం పెరుగుదలతో రూ.26,060 కోట్లకు చేరుకుంది.
దేశీయ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ క్యూ4లో 85 శాతం మంది ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని చీఫ్ పీపుల్ ఆఫీసర్(CPO) రామ్ సుందరరాజన్ ఎర్నింగ్ కాల్ సందర్భంగా వెల్లడించారు. Q4 FY23కి వేరియబుల్ పే మునుపటి త్రైమాసికాల మాదిరిగానే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో కంపెనీ ఒక్కో షేరుకు రూ.18 డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. అయితే వ్యాపారంలో మందగమనం కొనసాగుతుండగా నియామకాల్లో వేగం తగ్గినట్లు తెలిపింది. గత సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చిచూస్తే కొత్త నియామకాలు 57 శాతం తగ్గి 17,067గా నిలిచాయి. అయితే.. నియామకాల సంఖ్య గత క్యూ4లో 39,900గా ఉంది.
ఇక వ్యాపారం విషయానికి వస్తే.. కంపెనీ పైప్‌లైన్ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుందని HCLTech CEO విజయ్ కుమార్ వెల్లడించారు. ఇది బలమైన క్లయింట్ డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. పైగా ఆరోగ్యకరమైన రాబడి వృద్ధిని సాధించటానికి మార్జిన్లు సహాయంగా నిలుస్తాయన్నారు.
English summary
IT jaint HCL Tech announced 85 percent employees to get Variable pay in Q4, Know colplete details
IT jaint HCL Tech announced 85 percent employees to get Variable pay in Q4, Know colplete details
Story first published: Friday, April 21, 2023, 12:16 [IST]