For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Friday, April 21, 2023, 9:40 [IST]
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు గ్లోబల్ మాంద్యం భయాలు పెరుగుతున్న వేళ అనిశ్చితిలో ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లలో జాబ్ డేటా విడుదల కాగా.. కీలక సూచీ మాత్రం మాంద్యాన్ని సూచించటం ఆందోళనలకు కారణంగా మారింది. దీంతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో తీవ్ర ఒడిదొడుకుల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఉదయం 9.17 గంటల సమయంలో స్వల్ప లాభాల్లో 89 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 27 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 83 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 56 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.
ఈ రోజు ప్రధానంగా మార్కెట్లు ఐటీ రంగం షేర్లపై దృష్టి సారించాయి. హెచ్సీఎల్ తాజా ఫలితాలు మార్కెట్లను ఆశ్చర్యానికి గురిచేయటమే దీనికి కారణం. ఇదే సమయంలో సయ్యంట్ స్టాక్ కూడా మంచి జోరుమీదుంది. ఇదే క్రమంలో నేడు రిలయన్స్ తన ఫలితాల విడుదల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అయితే రిజర్వు బ్యాంక్ మినిట్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో సమచారం ప్రకారం ద్రవ్యోల్బణం కష్టాలు పూర్తిగా పోలేదని.. దానికి చాలా దూరంలో ఉన్నామని గవర్నర్ వ్యాఖ్యానించారు. మరింత కాలం ఇది కొనసాగనుందని ఆయన వ్యాఖ్యానించారు.
NSE సూచీలో దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, హీరో మోటార్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే సమయంలో టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, హిందాల్కొ, గ్రాసిమ్, ఎన్టీపీసీ, మారుతీ, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టి, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
English summary
Indian markets started flat amid us recession fears rose, rbi minutes over inflation out
Indian markets started flat amid us recession fears rose, rbi minutes over inflation out
Story first published: Friday, April 21, 2023, 9:40 [IST]