For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
Contents
అక్షయ తృతీయ ముందు బంగారం ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పసిడి ధరలు!!
| Published: Friday, April 21, 2023, 12:39 [IST]
అక్షయ తృతీయ ముందు పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి .అక్షయ తృతీయ ఒక్కరోజు ముందు బంగారం ధరలు పెరగడం, బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి షాక్ అనే చెప్పాలి. అక్షయ తృతీయకు మహిళలు సాధారణంగా బంగారాన్ని కొనుగోలు చేసి సిరి సంపదలతో తులతూగాలని భావిస్తారు.
ఈసారి అక్షయతృతీయ బంగారం కొనుగోలు చేయలేనంత అత్యధిక ధరలను రికార్డు చేయడం మహిళలను నిరాశకు గురిచేస్తుంది.ఇదిలా ఉంటే ఈ రోజు దేశీయంగా బంగారం ధర విషయానికి వస్తే పది గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 200రూపాయల మేర పెరిగి 56,050 రూపాయల వద్ద ట్రేడవుతోంది. 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 220రూపాయలు పెరిగే 61,150 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,050 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 61, 150 రూపాయలు వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,200 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,250 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 60,050 రూపాయలు కాగా 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,150 రూపాయలు వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. బెంగళూర్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,180 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,050 రూపాయల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61వేల 150 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది.
దేశంలోనే బంగారం ధరల అత్యధికంగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూర్, సేలం, ఈరోడ్, తిరుపూర్, తిరునవ్వేలి, తిరుచ్చి లలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,800 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది.
English summary
Big shock for Gold lovers before Akshaya Tritiya.. increased gold prices today!!
Gold lovers got a big shock before Akshaya Tritiya. Gold prices have increased today. Here are the prices today.
Story first published: Friday, April 21, 2023, 12:39 [IST]