For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Updated: Friday, April 21, 2023, 13:45 [IST]
Akshaya Tritiya: అక్షయ తృతీయ వచ్చేస్తోంది. అయితే ఈ క్రమంలో పసిడి ప్రియులకు పెద్ద ఊరటను ఇచ్చే వార్త ఒకటి వైరల్ గా మారింది. అదేంటంటే పసిడి ధరలు తగ్గుతాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జెతిన్ త్రివేది వెల్లడించారు.
ఇదే క్రమంలో ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున అమ్మకాలు గతంలో కంటే 15 శాతం తక్కువగా నమోదు కానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం గత కొంత కాలంగా గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల కారణంగా ధరలు క్రమంగా పెరుగుతూ రావటం దీనికి ఒక ప్రధాన కారణమని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అయితే కమోడిటీస్ మార్కెట్ MCXలో బంగారం ట్రేడింగ్ ధర 10 గ్రాములకు రూ.61,350 స్థాయి నుంచి తగ్గి రూ.60,000 చేరుకోవటం ఊరటన అందిస్తోంది.
ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత కాలంగా బంగారాన్ని కొంటూ నిల్వలను పెంచుకుంటోంది. పండుగల సందర్ఫంగా దేశంలో పసిడికి డిమాండ్ పెరగొచ్చనే నేపథ్యంలో.. ఈ కొనుగోళ్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తక్కువ మెుత్తంలో వినియోగదారులు బంగారం కొనుగోలు చేస్తున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ఇండియా రీజినల్ CEO సోమసుందరం వెల్లడించారు.
అక్షయ తృతీయ తరుణంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 కారెట్ల పసిడి చెన్నైలో రూ.61,800, ముంబైలో రూ.61,150, దిల్లీలో రూ.61,280, బెంగళూరులో రూ.61,150, కేరళ రూ.61,150, వడోదర రూ.61,180, కోయంబత్తూర్ రూ.61,800, మధురై రూ.61,800గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో ధరలను గమనిస్తే.. హైదరాబాదులో రూ.61,150గా ఉన్నాయి. ఇతర తెలంగాణలోని ఖమ్మం, నిజాంబాద్, వరంగల్ లో ధరలు రూ.61,150వద్ద కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ, తిరుపతి, విశాఖ, కాకినాడ, అమరావతి, అనంతపూర్, నెల్లూరుల్లో 10 గ్రాముల 24 కారెట్ల పసిడి ధర రూ.61,150 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ధర రూ.200 మేర రిటైల్ మార్కెట్లలో పెరిగాయి.
English summary
Amid Akshaya Tritiya gold retail prices rose and in MCX fall, Know latest rates in AP and Telangana
Amid Akshaya Tritiya gold retail prices rose and in MCX fall, Know latest rates in AP and Telangana