For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, April 12, 2023, 22:16 [IST]
Hyderabad: రైడ్ హెయిలింగ్ ఫ్లాట్ ఫారమ్ ఉబెర్ ప్రయాణికుల రక్షణ కోసం కొత్త సాంకేతికతను జోడించింది. అయితే ఈ కొత్త ఫీజర్లను ముందుగా హైదరాబాద్ ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
హైదరాబాద్‌లో రైడర్లు తమ సీట్ బెల్ట్‌లను ధరించేలా ప్రోత్సహించడానికి ‘ఆడియో సీట్‌బెల్ట్ రిమైండర్’ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు Uber మంగళవారం తెలిపింది. ఈ ఫీచర్ ప్రతి ఉబెర్ ట్రిప్ ప్రారంభంలో రైడర్లను బకిల్-ఇన్ చేయమని అడుగుతుంది. రానున్న నెలల్లో ఈ ఫీచర్‌ని ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.
ఆడియో సీట్‌బెల్ట్ రిమైండర్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం మాకు ఆనందంగా ఉందని ఉబెర్ ఇండియా అండ్ దక్షిణాసియా సేఫ్టీ ఆపరేషన్స్ హెడ్ సూరజ్ నాయర్ తెలిపారు. రైడర్లు తమ సీటు బెల్ట్‌లను ధరించేలా ప్రోత్సహించడానికి ఒక ప్రభావవంతమైన మార్గంగా తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో రహదారి భద్రతపై ఇది చూపే సానుకూల ప్రభావాన్ని చూసేందుకు తాము సంతోషిస్తున్నామని అన్నారు.
రైడ్ హెయిలింగ్ రంగంలో ‘ఆడియో సీట్‌బెల్ట్ రిమైండర్’ అనేది ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్ అని ఉబెర్ వెల్లడించింది. రైడర్ Uber ట్రిప్‌ను బుక్ చేసి వాహనంలోకి ప్రవేశించిన తర్వాత.. డ్రైవర్ ఫోన్ దయచేసి మీ భద్రత కోసం వెనుక సీట్ బెల్ట్‌లను ఉపయోగించండి” అంటూ రైడర్లను కోరుతూ ఆడియో రిమైండర్‌ను ప్లే చేస్తుంది. దీనికి తోడు వారికి ట్రిప్ ప్రారంభానికి ముందు బకిల్-ఇన్ చేయమని గుర్తు చేస్తూ యాప్‌లో పుష్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రయోగాత్మకంగా దీనిని ముందుగా హైదరాబాద్ యూజర్లకు కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
English summary
Uber introduced new safety feature Audio Seatbelt Reminder for hyderabad riders, Know details
Uber introduced new safety feature Audio Seatbelt Reminder for hyderabad riders, Know details..
Story first published: Wednesday, April 12, 2023, 22:16 [IST]