For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Thursday, April 13, 2023, 8:10 [IST]
IT News: దేశం గర్వించదగ్గ సంస్థ TCS తన పెట్టుబడిదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడు పెద్ద మొత్తాల్లో డివిడెండ్ ప్రకటిస్తూ ఉంటే ఈ కంపెనీ.. మరోసారి ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించేందుకు సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో ఈ ఏడాది డివిడెండ్స్ ప్రకటించింది. తాజాగా ఇప్పుడు ఇంకోమారు పెట్టుబడిదారులను ఖుషీ చేయనుంది.
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS).. FY23కి ఒక్కో ఈక్విటీ షేరుకి రూ.24 చొప్పున తుది డివిడెండ్ ను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక డివిడెండ్లను ఇచ్చి రికార్డు సృష్టించింది. ఏడాది మొత్తంగా చూస్తే దాదాపు 45 వేల 602 కోట్లను పెట్టుబడిదారులకు చెల్లించినట్లు తెలిపింది. కాగా చివరి డివిడెండ్ కోసం రికార్డు తేదీని నిర్ణీత సమయంలో వెల్లడించనున్నట్లు పేర్కొంది.
ఒక్కో ఈక్విటీ షేరుకి 24 చొప్పున డివిడెండ్ చెల్లించాలని డైరెక్టర్లు సూచించారని TCS తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. వాటాదారుల ఆమోదంతో, కంపెనీ 28వ వార్షిక జనరల్ మీటింగ్ ముగిసిన పిమ్మట నాలుగు రోజుల్లో చెల్లించనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు 3 మధ్యంతర డివిడెండ్లు పే చేయగా, తాజాగా తుది విడత చెల్లింపునకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది.
రూ.8 చొప్పున జూలై 2022లో మొదటి మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. అనంతరం అక్టోబర్ లో రెండోమారు రూ.8 ఇన్వెస్టర్ల ఖాతాలకు జమచేసింది. వీటికి తోడు మరో రూ.67 చొప్పున ప్రత్యేక డివిడెండ్ చెల్లింపులు సైతం జరిగాయి. మూడింటినీ పరిగణనలోకి తీసుకుంటే, FY23లో 9,100 శాతాన్ని ఈక్విటీ డివిడెండ్ రూపంలో పెట్టుబడిదారులకు అందిచిందన్నమాట.
FY22లోనూ ఈక్విటీ షేరుకు రూ.43 చొప్పున 4300 శాతాన్ని TCS డివిడెండ్ రూపంలో పే చేసింది. YoYతో చూస్తే వాటాదారులకు కంపెనీ జరిపిన చెల్లింపులు 12.2 శాతం పెరిగి 38 వేల 10 కోట్లకు చేరాయి. వీటిలో డివిడెండ్లు, బైబ్యాక్, పన్నులు సైతం ఉన్నాయి. ఇక సంస్థ లాభాలు చూస్తే, Q4FY23లో ఏకీకృత నికర లాభంలో వృద్ధి 14.8 శాతం YoY, 5.03 శాతం QoQ చొప్పున మొత్తం 11 వేల 392 కోట్లకు పెరిగింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం YoY 16.94 శాతం, QoQ 1.6 శాతం వెరసి 59 వేల 162 కోట్లుగా ఉంది.
English summary
TCS announced Rs.24 as dividend for fourth time FY23
TCS final dividend
Story first published: Thursday, April 13, 2023, 8:10 [IST]