For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Thursday, April 13, 2023, 7:43 [IST]
Banking: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల ఏర్పడిన బ్యాంకింగ్ సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఆపద నుంచి గట్టెక్కడానికి ఇబ్బందుల్లో ఉన్న క్రెడిట్ సుస్సీ బ్యాంకును UBSలో విలీనం చేసేందుకు స్విస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఆ దేశ పార్లమెంటులో చర్చ జరిగింది. అందులో నిర్వహించిన ఓటింగ్ ఫలితాలు ఆర్థికవేత్తలను షాక్ కి గురిచేశాయి.
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న క్రెడిట్ సుస్సీని UBS కొనుగోలు చేయడాన్ని స్విట్జర్లాండ్ పార్లమెంట్ దిగువసభ తిరస్కరించింది. 100 బిలియన్ స్విస్ ఫ్రాంక్ లు(దాదాపు 110 బిలియన్ అమెరికన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఒప్పందాన్ని సభ్యులు వ్యతిరేకించారు. అయితే సర్కారు నిర్ణయం ఎమర్జెన్సీ యాక్టు ప్రకారం కుదిరిన ఒప్పందం కావడంతో.. ఈ ప్రక్రియ కేవలం లాంఛనప్రాయంగా మిగలడం గమనార్హం.
అత్యవసర చట్టం ద్వారా నగదు చెల్లించడానికి స్విస్ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. మార్చి 19న ఫైనల్ చేసిన క్రెడిట్ సుస్సీ టేకోవర్‌పై ఈ నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపదు అని ఓటింగ్ తర్వాత ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించడం.. మార్కెట్ లో చెడు సంకేతాన్ని చూపుతుందని పేర్కొంది. ఈ డీల్ కు ఎగువసభ సవరణలు ప్రతిపాదిచడంతో ప్రస్తుతం దిగువ సభకు వచ్చింది.
వివిధ సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణకు అలవాటుపడిన స్విస్ లో.. రెస్క్యూ ప్యాకేజీ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు కోపంతో ఉన్నారు. ఓటింగ్ ను పరిశీలిస్తే 103-71 రేటుతో ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఏడాది అక్టోబరులో అక్కడ ఎన్నికలు జరగనుండగా.. బెడిసికొట్టిన నిర్ణయం విషయంపై పాలకపక్షం ఆందోళనలో ఉంది. వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో..
English summary
Swiss parliament rejected the Credit Suisse merge with UBS
Swiss parliament rejected the Credit Suisse merge with UBS
Story first published: Thursday, April 13, 2023, 7:43 [IST]