• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఎంటర్‌టైన్‌మెంట్‌

రాజమౌళి – మహేష్ బాబు సినిమా, హనుమంతుడే ఆ పాత్రకు స్పూర్తి?

BhanuGopal Ch by BhanuGopal Ch
April 12, 2023
in ఎంటర్‌టైన్‌మెంట్‌
0 0
0
రాజమౌళి-–-మహేష్-బాబు-సినిమా,-హనుమంతుడే-ఆ-పాత్రకు-స్పూర్తి?

Mahesh Babu: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా టేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘స్టూడెంట్ నెం1’ నుంచి మొన్నటి ‘ఆర్ఆర్ఆర్’ వరకూ వచ్చిన సినిమాలు చూస్తే అది క్లియర్ గా తెలుస్తుంది. ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజమౌళి. ‘బాహుబలి’ టాలీవుడ్ సినిమాను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లిన ఈ దర్శకధీరుడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి రాజమౌళి తీయబోయే తదుపరి సినిమాపై ఎంత ఆసక్తి ఉంటుందో తెలిసిందే. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరో మహేష్ బాబు అని తెలియడంతో ఈ భారీ ప్రాజెక్టు పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాతోనే మహేష్ బాబు పాన్ ఇండియా లెవల్ లో నటించబోతున్నాడు. ఇప్పటికే ఇందులో మహేష్ బాబు పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 

ఈ సినిమాలో మహేష్ బాబు ఇండియన్ జేమ్స్ బాండ్ గా కనిపిస్తారు అనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి-మహేష్ మూవీలో ఆయన పాత్ర హనుమంతుని నుంచి ప్రేరణ పొందినట్లు సమాచారం. సాధారణంగా రాజమౌళి పురాణాలు, రాజుల కాలం స్టోరీలంటే ఇంట్రస్టింగ్ గా ఉంటారు. తన సినిమాలోని పాత్రలను రామాయణ, మహాభారతాల నుంచి ప్రేరణగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు పాత్రను కూడా హనుమంతుని నుంచి ప్రేరణగా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాను అడ్వెంచర్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారనే వాదన ఉంది. అందుకే హనుమంతుని లాగా ఈ సినిమాలో హీరో కూడా అసమాన శక్తులు కలిగి ఉంటారని చర్చించుకుంటున్నారు.  ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట రాజమౌళి. అడ్వెంజర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్నఈ చిత్రం ఎక్కువగా అమెజాన్ అడవుల్లో చిత్రీకరించబడుతుందని టాక్. ఇక  ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. మరి ఈ భారీ ప్రాజెక్టులో ఏ విఎఫ్ఎక్స్ కంపెనీ భాగం అవుతుందో చూడాలి. మరోవైపు మహేష్ బాబు కూడా రాజమౌళి పట్ల పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను రెండు లేదా మూడు పార్ట్ లుగా తీయడానికి చూస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాజమౌళితో చేతులు కలపనున్నారు సూపర్ స్టార్. ఈ సినిమాను 2025 చివరి నాటికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సన్సేషనల్ కాంబో ఈసారి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. 

Also Read : ‘ఐ లవ్ యు ఇడియట్’ రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?

EXCLUSIVE: #MaheshBabu’s character inspired by #LordHanuman in #SSRajamouli’s jungle adventure. Read more details. #SSMB29 https://t.co/RMLpgsQq0G

— Himesh (@HimeshMankad) April 12, 2023

Tags: mahesh babu moviesRajamoulisuper star mahesh babuఎంటర్‌టైన్‌మెంట్‌

Recent Posts

  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?
  • ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు
  • AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్‌ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
  • నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
  • ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది – మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In